ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత రెండేళ్లుగా కొత్తగా వస్తున్న కంపెనీలు కంటే, వెళ్ళిపోతున్న కంపెనీల లిస్టు పెరిగిపోతుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి చూసి, కొన్ని కంపెనీలు వెనక్కు వెళ్ళగా, రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో కొన్ని కంపెనీలు వెళ్ళిపోయాయి. ప్రస్తుతం ప్రపంచం ఉన్న పరిస్థితిలో, కొత్తగా పెట్టుబడులు ఆకర్షించాలి అంటే ఎంతో శ్రమించాలి. మన చిన్న రాష్ట్రం మరింతగా ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉంటేనే, కొత్త కంపెనీలు వస్తాయి. అయితే ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి లేదు. బహుసా కొత్త పెట్టుబడులతో ఓట్లు రావు అనుకున్నారో ఏమో, అప్పు చేసి పధకాలు ఖర్చు పెడితే చాలు అనుకున్నారో ఏమో కానీ, కొత్త పెట్టుబడులు తీసుకు రాక పోగా, ఉన్న వాటి పై కక్ష తీర్చుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలోనే కాక, ప్రపంచ వ్యాప్తంగా బ్యాటరీల ఉత్పత్తిలో అమర్​రాజా బాటరీస్ కంపెనీకి మంచి పేరు ఉంది. చిత్తూరు జిల్లాలో ఈ సంస్థకు మూడు ప్లాంట్ల వరకు ఉన్నాయి. దాదాపుగా ఆరు వేల మంది ఉద్యోగులు, ఈ కంపెనీలో ఉపాధి పొందుతున్నారు. ఇలాంటి కంపెనీని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేసే దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నిద్ర పట్టేలా లేదు. నాలుగు నెలల క్రిందట, ఆ కంపెనీకి గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూమిని వెనక్కు తీసుకోవటానికి ప్రయత్నాలు చేయగా, కోర్టు ఆదేశాలతో అది కుదరలేదు.

amar01052021 2

దీంతో ఇప్పుడు రూట్ మార్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు ఇచ్చింది అంటూ, అమర్​రాజా బాటరీస్​ కు సంబందించిన ప్లాంట్స్ అన్నీ మూసేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ కంపెనీ కాలుష్య నియంత్రణ చర్యలు పాటించటం లేదు అంటూ, కంపెనీ మూసేయాలని ఆదేశించారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల పై, అమర్​రాజా బాటరీస్​ స్పందించింది. ఆ ఉత్తర్వులు పరిశీలిస్తున్నాం అని, తగిన రీతులో దీనికి సమాధానం ఇస్తాం అని చెప్పారు. తాము అన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నామని, పర్యావరణ పరిరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని, తెలిపారు. అయితే అమర్​రాజా బాటరీస్​, గుంటూరు టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ ది కావటంతోనే, ప్రభుత్వం ఇలా కక్ష సాధింపుకు పాల్పడుతుందని, తెలుగుదేశం ఆరోపిస్తుంది. అమర్​రాజా బాటరీస్​ కు ఇది షాక్ కాదని, అక్కడ పని చేస్తున్న వేలాది మంది ఉద్యోగులకు షాక్ అని, అధిక పన్నులు ఈ కంపెనీ నుంచి తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ అని వాపోయారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read