అమరావతి కోసం రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమాన్ని, పలు రకాలుగా వైసీపీ నేతలు హేళన చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులు ఆవేదన, మహిళల బాధ కంటే, వీరి వెటకారం ఎక్కువ అయ్యింది. పలు సందర్భాల్లో వైసీపీ నేతలు హేళన చేసారు. ఇప్పుడు అమరావతి ఉద్యమం 500 రోజులు అయిన సందర్భంగా, ఉద్యమం చేస్తుంటే, మంత్రి బొత్సా మళ్ళీ హేళన చేసారు. 500 రోజుల ఉత్సవాలు కాకాపోతే, 1000 రోజులు ఉత్సవాలు చేసుకోండి అంటూ హేళన చేసారు. అమరావతి ఉద్యమాలు అన్నీ బోగస్ అని అన్నారు. ఉద్యమాన్ని పండుగలా జరుపుకుంటూ, మరోపక్క రైతులు బాధపడుతున్నారని చెప్పటం ఏమిటి అంటూ ద్దేవ చేశారు. అమరావతిలో పెట్టిన పరిరక్షణ సమితిని చంద్రబాబు తన బినామీల ఆస్తులను పరిరక్షించుకునేందుకు ఏర్పాటు చేసారని అన్నారు. మూడు రాజధానుల విధానానికి ప్రజల నుంచి కూడా ఆమోదం లభించిందన్నారు. తన బినామీలకు ఎటు వంటి నష్టం రాకూ డదనే ధ్యేయంతో చంద్రబాబు పని చేస్తున్నాడన్నది అర్ధమవుతోందన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల గురించి ప్రభుత్వం ఎంతో బాధ్యతతో వుందన్నారు.
చంద్ర బాబు సీఎంగా వున్నప్పుడు ప్రకటించిన దానికన్నా ఎక్కువ కాలపరిమితికి కౌలు, పెన్షన్లు, పంటపరిహారం కూడా పెంచి ఇస్తున్నామని చెప్పుకొచ్చా రు. ఇచ్చిన మాట ప్రకారం భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంటే.. కోర్టులలో సాంకేతికపరమైన అంశాలతో స్టేలు తీసుకు వచ్చి చంద్రబాబు, ఆయన అనుయాయులు అడ్డుకుంటు న్నారని ఆరోపించారు. లేకపోతే ఈ పాటికే రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చి ఉండే వాళ్లమని స్పష్టంచేశారు. హైదరాబాదు పరిమితమైన చంద్రబాబు ఈ రోజు జూమ్ కాన్ఫెరెన్స్ లో చెప్పినవన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. ఈ సమయంలోనూ రాజకీయాలకు అతీతంగా చిత్తశుద్ధితో అన్ని వర్గాల వారికీ, రైతులు, రైతుకూలీలు, సామాన్యులు, ఉద్యోగులకు అందరికీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రతి క్షణం పని చేస్తున్నామని వెల్లడించారు. అయితే మంత్రి బొత్సా వ్యాఖ్యల పై అమరావతి మహిళలు , రైతులు మండి పడ్డారు. మొదటి నుంచి మమ్మల్ని ఇలా వేధిస్తూనే ఉన్నారని అన్నారు.