ఈ రోజు అయుదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు, తిరుపతి ఉప ఎన్నికల ఫలితం కూడా వస్తుంది. అయితే తిరుపతి ఉప ఎన్నికలో హోరా హోరీ నడుస్తుందని, ఎన్నిక జరిగే ముందు వరకు అందరూ భావించారు. అయితే ఎన్నిక జరిగిన తీరు, ఒక ఉత్సవంలా, ఒక మేళా లాగా ఉప ఎన్నిక జరిగిన తీరు చూసి, అన్ని వేల దొంగ ఓట్లు పడ్డ తరువాత వైసీపీ గెలుస్తుందని అందరూ ఒక అంచనాకు వచ్చారు. అయితే ఇన్ని దొంగ ఓట్లు వేసి, వాలంటీర్లతో పధకాలు పీకుతాం అని బెదిరించి, పోలీసులను ఉపయోగించి, ఇవన్నీ చేసిన తీరు చూసి, 5 లక్షల మెజారిటీ దాటి పోతుందని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న ట్రెండ్స్ చూస్తుంటే, 2, 2.5 లక్షల వరుకే మెజారిటీ వచ్చే అవకాసం కనిపిస్తుంది. అంటే పోయిన సారి వచ్చిన మెజారిటీ కానీ, అంత కంటే తక్కువ కానీ మెజారిటీ వచ్చే అవకాసం కనిపిస్తుంది. అంటే, దొంగ ఓట్లు లెక్క తీసేస్తే, హోరా హోరీ పోరు జరిగిందనే అర్ధం అవుతుంది. ఇప్పటి వరకు, వైసీపీ కి 2,29,424(55.9 శాతం) ఓట్లు, టీడీపీకి 1,33,613(32.5 శాతం) ఓట్లు, బీజేపీ పార్టీకి 23,223(5.7 శాతం) ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 94 వేల మెజారిటీతో వైసీపీ ఉంది. ఇంకా సగం లెక్కింపు మిగిలి ఉంది. ఇక పొతే, ఉదయం మొదటి రౌండ్ ఫలితం చూసి, పనబాక లక్ష్మి కౌంటింగ్ కేంద్రం ఉంచి వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి.
ఆ వార్తలను పనబాక లక్ష్మి ఖండించారు. తానూ కౌంటింగ్ కేంద్రంలోనే ఉన్నాయని అన్నారు. ఆ వార్తలను కొట్టి పారేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగలేదని తెలిసినా, తన వంతు బాధ్యతగా కౌంటింగ్ కేంద్రం వద్దే ఉన్నానని అన్నారు. దొంగ ఓట్ల తమాషా చూడటానికి ఇక్కడే కూర్చున్నా అంటూ, వ్యంగ్యంగా స్పందించారు. జరగాల్సింది అంతా ముందే ప్లాన్ ప్రకారం జరిగిపోయిన విషయం అందరికీ తెలుసు అని, వీళ్ళ తమాషా ఏంటో చూద్దామని కౌంటింగ్ కేంద్రం వద్దే ఉన్నానని, ఇక్కడ నుంచి వెళ్ళిపోయానని వస్తున్న వార్తలు అన్నీ అబద్ధం అని అన్నారు. ఇక మరో పక్క 5 లక్షల మెజారిటీ అని, 5 లక్షల మెజారిటీ రాకపోతే రాజీనామా చేస్తానని, ఇలా అనేకం చెప్పిన వైసీపీ మంత్రులు ఇప్పటి వరకు స్పందించ లేదు. గెలుస్తున్నాం కదా, ఇది మా ప్రజా విజయం ఇది అదీ అంటూ రొటీన్ గా వాడే డైలాగ్స్ చెప్తున్నారు. ఇప్పటి వరకు సగం ఓటింగ్ కౌంటింగ్ పూర్తి అవ్వగా, ఇంకా సగం మిగిలి ఉంది. గతంలో వచ్చిన మెజారిటీ వస్తుందా, అంత కంటే ఎక్కువ ఎంత వస్తుంది అనే దాని పై ఇప్పుడు చర్చ నడుస్తుంది.