జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, విద్యార్థుల ప్రాణాలకంటే పరీక్షలే ముఖ్యమయ్యాయి. కారణాలుఏమిటో తెలియదు గానీ, ప్రభుత్వం ప్రాణాలను కాదని, పరీక్షలకే ఎక్కవ విలువ ఇస్తోంది. పరీక్షల నిర్వహణలో మొండి పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి పై విద్యార్ధులు తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా హైకోర్టు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, మే 3 వరకు అవకాసం ఇచ్చి, పరీక్షలు నిర్వహించాలి అనే నిర్ణయం పై, మరోసారి ఆలోచించాలని ఆదేశాలు ఇచ్చింది. అసలు నిజానికి ఈ రోజు హైకోర్ట్, ప్రభుత్వానికి చీవాట్లు పెట్టుద్దని అందరూ అనుకున్నారు. అయితే హైకోర్టు మాత్రం, ప్రభుత్వానికి మరో చాన్స్ ఇచ్చింది. ఇప్పటికే ఈ పరీక్షలు విషయంలో, ప్రజల్లో పలుచున అయిన జగన్ ప్రభుత్వానికి, హైకోర్టు మంచి అవకాసం ఇచ్చిందనే చెప్పాలి. ఈ అవకాసం ఉపయోగించికుని, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పరీక్షలు పై వెనక్కు తగ్గితే, అన్ని విధాలుగా ప్రభుత్వం బయట పడుతుంది. లేదు ఇలాగే మొండి పట్టుదలతో ఉంటే, కోర్టు ఇచ్చే ఆదేశాలతో, ప్రభుత్వం పరువు పోవటం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో రోజు రోజుకీ కేసులు అధికం అవ్వటం, ఈ రోజు రికార్డు స్థాయిలో 17 వేల కేసులు రావటం, వచ్చే మే నెల మొత్తం కేసులు పెరుగుతాయని అందరూ చెప్తూ ఉండటంతో, హైకోర్టు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించికుని, జగన్ మోహన్ రెడ్డి పరీక్షల పై వెనకుడుగు వేస్తుందేమో చూడాలి. ఇలా చేస్తే ఇప్పటికే అయిన డ్యామేజ్ ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, కొంచెమైనా నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది.

hcj 30042021 2

మరో పక్క ఇదే అంశం పై తెలుగుదేశం పార్టీ జగన్ పై విరుచుకు పడింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ చెంగల్రాయుడు మాట్లాడుతూ, "ముఖ్యమంత్రి బుర్ర పెద్దగా పనిచేస్తున్నట్లు లేదు. పరీక్షలు రద్దుచేస్తే, నారాలోకేశ్ కు క్రెడిట్ దక్కుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లున్నాడు. ఆయన ఆలోచనలు గ్రహించాక, లోకేశ్ తనలేఖ వెనక్కు తీసుకుంటానని ప్రకటించాడు. పరీక్షలు రద్దుచేయండి లేదా వాయిదా వేయండి అంతేగానీ, నా గురించి ఆలోచించి, పిల్లలను బలిచేయవద్దని లోకేశ్ చాలా స్పష్టంగా ముఖ్యమంత్రికి చెప్పాడు. హైకోర్టులో కూడా పరీక్షల వ్యవహారంపై ప్రజాప్రయోజనవ్యాజ్యం ధాఖలైంది. మానవత్వంతో ఆలోచించాలని మాత్రమే ముఖ్యమంత్రిని కోరుతున్నాము. బంగారంతో వెళుతున్న నావకు రంధ్రం పడితే, దానిలోని వస్తువులన్నింటినీ నీటిలో పడేసి, మనుషులను కాపాడాలని ఒక కథలో చెప్పడం జరిగింది. అదే విధంగా ముఖ్యమంత్రి పరీక్షలు వాయిదా వేసి, విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకటి నుంచి 9వతరగతి పిల్లలను ఇళ్లల్లో కూర్చొబెట్టిన ప్రభుత్వం, పది, ఇంటర్ విద్యార్థులను మాత్రం పరీక్షలు రాయాల్సిందేననడం ఏమిటి? అటువంటి నిర్ణయాలు తీసుకునేముందు ఆలోచించరా? జనాభిప్రాయం దృష్ట్యా ముఖ్యమంత్రి వెంటనే పరీక్షలు రద్దు చేయడమో, వాయిదా వేయడమో చేయాలని టీడీపీ తరుపున డిమాండ్ చేస్తున్నాం." అని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read