అమరరాజా కంపెనీకి షాకుల మీద షాకులు ఇస్తుంది జగన ప్రభుత్వం. కొన్ని వేల మందికి ఉపాధి ఇస్తూ, రాష్ట్రానికి అధికంగా పన్నులు కడుతూ, రాష్ట్రంలోనే ఒక పెద్ద కంపెనీగా ఉన్న అమరరాజా కంపెనీ పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు, పలువురు ఆశ్చర్య పోతున్నారు. ఈ రోజు ఉదయం అమరరాజా కంపెనీ మూసేయమని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలు ఇచ్చింది అంటూ వార్తలు వచ్చాయి. ప్రభుత్వం నోటీసులు పై ఎలా ముందుకు వెళ్ళాలి అని ఆ కంపెనీ డైరెక్టర్లు ఈ రోజు కూర్చుని చర్చిస్తున్న సమయంలోనే, ఈ రోజు సాయంత్రానికే, అమరరాజా కంపెనీకి కరెంటు నిలిపివేయాలి అంటూ మరో ఆదేశం వెళ్ళింది. ఇంతలా ఎందుకు కక్ష గడుతున్నారో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఈ రోజు మేడే సెలవు కావటం, రేపు ఆదివారం కావటం, సోమవారం వరకు కోర్టులు లేకపోవటం, ఇలా చూసి మరీ టార్గెట్ చేస్తున్నారని పలువురు వాపోతున్నారు. ఒక పెద్ద కంపెనీని, ప్రభుత్వం ఇలా వేధిస్తే, అది రాష్ట్ర ఇమేజ్ కు చాలా నెగటివ్ అవుతుందని పలువురు వాపోతున్నారు. కొన్ని వేల ఉద్యోగాలు ఇచ్చే కంపెనీకి కరెంటు ఆపివేయాలని ఆదేశాలు ఇవ్వటం పై, పలువురు ఆశ్చర్య పోతున్నారు. నిజంగానే ఏదైనా సమస్య ఉంటే, దానికి పరిష్కారం ఏమిటో ఆలోచించాలి కానీ, ఇలా రాత్రికి రాత్రి కరెంట్ తీసేయటం, మూసేయాలని చెప్పటం సమంజసం కాదని అంటున్నారు.

galla 01052021 2

అమరరాజాకు చిత్తూరు జిల్లాలో ఉన్న నాలుగు యూనిట్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ఏపి ఎస్పీడీసిఎల్ కు, ఏపి పొల్యూషన్ బోర్డు ఆదేశాలు ఇచ్చింది. అయితే అమరరాజా కంపెనీ, పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడుతుంది అంటూ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆరోపిస్తుంది. కాలుష్య రహితంగా నిర్వహించాల్సిన పరిశ్రమను, యాజమాన్యం పట్టించుకోలేదని విఫలం అయ్యింది అంటూ అభియోగాలు మోపారు. అక్కడ పరీక్షులు చేయంగా , అక్కడ ప్రజల్లో తీవ్ర స్థాయిలో లెడ్ నమూనాలు, రక్తంలో ఉన్నాయని చెప్తున్నారు. అందుకే ఈ నాలుగు యూనిట్ లు మూసివేయాలని వార్తలు రావటం, సాయంత్రానికి విద్యుత్ సరఫరా కూడా ఆపివేయాలని చెప్పటంతో, అందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు. గత వారం జువారి సిమెంట్ కంపెనీని కూడా ఇలాగే మూసివేయించారు. అయితే ఇదే సమయంలో విశాఖలో విజయసాయి రెడ్డి అల్లుడి ఫర్మా కంపెనీ కానీ, జగన్ మోహన్ రెడ్డికి సంబందించిన భారతీ సిమెంట్స్ కానీ, పర్యావరణాన్ని ఏమి ఉల్లంఘించటం లేదా అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read