తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20న పెట్టే ఒక్క రోజు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకుని. ఒక్క రోజు అసెంబ్లీ సమావేశం ఏమిటి అంటూ తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. పెట్టేది బడ్జెట్ కోసమని, బడ్జెట్ పై చర్చ జరగకుండా, ఈ సమావేశాలు ఎందుకు కోసమని తెలుగుదేశం ప్రశ్నించింది. ఈ అంశాలు అన్నిటి పై తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకున్నారు. మెజారిటీ నేతలు ఈ ఒక్క రోజు సమావేశాలు అనవసరం అని తేల్చారు. అదీ కాక, ప్రస్తుతం రాష్ట్రంలో క-రో-నా విలయతాండవం చేస్తున్న వేళ, 175 మంది ఎమ్మెల్యేలు, సిబ్బంది అంతా కలిసి ఒక్క చోట కూర్చుంటే ఎంతో ప్రమాదం అని, ఒక పక్క కర్ఫ్యూ అని చెప్తూ, రాష్ట్రంలో భయంకర పరిస్థితి ఉంటే, ఈ సమయంలో సమావేశాలు ఏమిటి అని ప్రశ్నిస్తున్నాయి. దీంతో మెజారిటీ నేతల అభిప్రాయంతో, అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని తెలుగుదేశం సీనియర్ నేతలు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ, అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయాన్ని ప్రకటించారు.

jagan 18052021 2

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ "ఈ రెండేళ్లలో 39 రోజులే అసెంబ్లీ సమావేశాలు జరిపారు - జగన్.. డెమోక్రటిక్ డిక్టేటర్‍గా వ్యవహరిస్తున్నారు - ఎలాంటి చర్చకు అవకాశం లేదనే సమావేశాలు బహిష్కరణ - శాసనసభ పట్ల గౌరవం లేదు కనుకే ఆర్డినెన్స్ తెచ్చారు - శాసనసభ సమావేశాలకు సమాంతరంగా మాక్ అసెంబ్లీ పెడుతున్నాం" అని చెప్పారు. ఇక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ "ఎల్లుండి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాన్ని టీడీపీ బహిష్కరిస్తోంది - ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలు మంచి పద్ధతి కాదు - క-రో-నా కట్టడి గురించి సీఎం జగన్ ఆలోచించడం లేదు - క-రో-నాపై దృష్టి సారించి ప్రజల ప్రాణాలు కాపాడాలి - క-రో-నాపై ఒక్కసారైనా అఖిలపక్ష సమావేశం నిర్వహించారా? - ప్రతిపక్ష నేతల సూచనలు, సలహాలు తీసుకోరా? - పొరుగు రాష్ట్రాలను చూసైనా సీఎం జగన్ నేర్చుకోవడం లేదు - అక్కడ ప్రజలను అన్ని రకాలుగా ఆదుకుంటుంటే, ఇక్కడ వదిలేసారు" అని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read