క-రో-నా సమయంలో జగన్మోహన్ రెడ్డిప్రభుత్వం ప్రజలప్రాణాలతో ఆడుకుంటోందని, కేంద్రప్రభుత్వం, మిగిలిన రాష్ట్రాలు ప్రజలగురించి ఆలోచిస్తుంటే ముఖ్యమంత్రి నీరోచక్రవర్తిలా వ్యవహరిస్తున్నాడని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి, శాసనమండలిలో టీడీపీ పక్షనేత యనమలరామకృష్ణుడు మండిపడ్డారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే " రాష్ట్ర ఆర్థికపరిస్థితిని ఈ ముఖ్యమంత్రి చిన్నాభిన్నంచేశాడు. ఆర్థికవ్యవస్థ అసాంతం అతలాకుతలమైంది. చట్టసభలపై, న్యాయవ్యవస్థపై, మీడియాపై, పరిపపాలనా వ్యవస్థలను తనకు అనుకూలంగా మార్చుకోవాలనే ఆత్రుతలో ఉన్నాడు. అసెంబ్లీ సమావేశాలు అనేవి రాజ్యాంగపరంగా తప్పనిసరి. అందుకే గతిలేక ముఖ్యమంత్రి వాటిని నిర్వహిస్తున్నాడు. అసెంబ్లీ సమావేశాలపేరుతో గవర్నర్ తో నాలుగు మాటలు చెప్పించి, ముఖ్యమంత్రి తనను తాను పొగిడించుకునే కార్యక్రమం నిర్వహించబోతున్నాడు. మార్చి నెలాఖరుకి ఆర్థికసంవత్సరం ముగిసే వేళ ముఖ్యమంత్రి ఎందుకు బడ్జెట్ సమావేశాలు పెట్టలేదు? క-రో-నా కేసులు తక్కువఉన్నప్పుడు అన్ని రాష్ట్రాలు అసెంబ్లీ నిర్వహించాయి. ముఖ్యమంత్రికి శాసనసభ, చట్టసభలపై గౌరవం లేదు కాబట్టే, అప్పుడు సమావేశాలు పెట్టలేదు. అప్పుడొక ఆర్డినెన్స్, రేపు మరొక ఆర్డినెన్స్ పాస్ చేయబోతున్నారు. దేశచరిత్రలో ఒకేఒక్కసారి జమ్మూ కశ్మీర్ లో ఆర్డినెన్స్ తో బడ్జెట్ పాస్ చేసుకున్నారు. రాష్ట్రంలో జమ్మూకశ్మీర్ లాంటి పరిస్థితులు లేవుకదా? అలాంటప్పుడు ఈ ముఖ్యమంత్రి సజావుగా సభ నిర్వహించాలనే ఆలోచన ఎందుకు చేయడంలేదు? అవకాశమున్నప్పుడుకూడా ముఖ్యమంత్రి సమావేశాలు నిర్వహంచలేదు. ఇప్పుడేమో తప్పనిసరి పరిస్థితుల్లో, విధిలేక శాసన సభ పెడుతున్నారు. సభ పెట్టేది కేవలం ముఖ్యమంత్రిని పొగడటానికి, ప్రభుత్వం తరుపును తప్పుడు లెక్కలు చెప్పడానికేనని అర్థమైపోయింది. అందుకే టీడీపీ శాసనసభాపక్షం సమావేశాలను బహిష్కరిస్తోంది. ప్రతిపక్షానికి అవకాశంలేని విధంగా, సంఖ్యా బలం ఉందన్న అహంకారంతోనే సమావేశాలు నిర్వహించబోతున్నారు.

తప్పులుచేస్తూకూడా తనవాళ్లతో పొగిడించుకోవాలనే దుష్ట ఆలోచనతోనే ముఖ్యమంత్రి ఒకరోజు సభకు పరిమితమయ్యాడు. రెండేళ్ల తన పాలనలో కేవలం 38 రోజులే ఈ ముఖ్యమంత్రి శాసససభ సమావేశాలు నిర్వహించాడు. ప్రజల సమస్యలు, ఇప్పుడున్న పరిస్థితులపై చర్చించడానికి, వాటి పరిష్కారానికి ప్రభుత్వం సమావేశాలు పెట్టడం లేదని అక్కడే తేలిపోయింది. ప్రభుత్వానికి సమాంతరంగా ప్రజల సమస్యలనే అజెండాగా తీసుకొని మాక్ అసెంబ్లీ నిర్వహించే ఆలోచనలో టీడీపీ ఉంది. ముఖ్యమంత్రి చర్యలకు, నిర్లక్షపూరిత ధోరణికి వ్యతిరేకంగానే టీడీపీ శాసనసభస మావేశాలను బహిష్కరిస్తోంది. క-రో-నాపై, ప్రజల ప్రాణాలపై ముఖ్యమంత్రి అనుసరిస్తున్న నిర్లక్ష్యధోరణకి వ్యతిరేకంగానే టీడీపీ మాక్ అసెంబ్లీ ప్రధాన ధ్యేయం. ముఖ్యమంత్రిని ఎండగట్టడమే టీడీపీ మాక్ అసెంబ్లీ ప్రధాన ఉద్దేశం. శాసనసభలో నిరసనపద్ధతులు అనేకరకాలుగా ఉంటాయి. ప్రజల జీవితాలతో ఆడుకుంటూ, ప్రతిపక్షాలు, మీడియాని ఖాతరుచేయకుండా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు కాబట్టే తాము సమావేశాలను బహిష్కరిస్తున్నాం. ముఖ్యమంత్రి ప్రవర్తన మారాలని, రాక్షసులు ఎంతచెప్పినా వారి ప్రవర్తన మార్చుకోలేదుకాబట్టే, వారు పతనమయ్యారన్నారు. ముఖ్యమంత్రి తనధోరణి మార్చుకుంటే, ప్రభుత్వానికి సహకరించడానికి టీడీపీ ఎప్పుడూ ముందుంటుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక బీఏసీ సమావేశాలకు కూడా విలువ ఉండటంలేదు. అక్కడ ఒకటిచెప్పి, సభనిర్వహణలో మరోలా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షం శాసనసభలో మాట్లాడుతుంటే, కనీసం వారి వాదనకు విలువకూడా ఇవ్వకపోతే ఎలాగ? ప్రతిపక్షనేతలు ఎక్కడమాట్లాడిన తప్పంటారు. మీడియా వారిని అనుమతించరు? లోపలా బయటా మొత్తం ఆంక్షలే. ఇన్ని ఆంక్షలమధ్యన ప్రతిపక్షం ఎక్కడ మాట్లాడుతుంది? అందుకే సభకు , సభ పరిసరాలకు పోకూడదని నిర్ణయించాము. ప్రభుత్వం రెండే రెండు అజెండాలపై సభను నిర్వహిస్తుంది. ఒకటి గవర్నర్ ప్రసంగం, రెండోది బడ్జెట్. తెలుగుదేశంపార్టీ అజెండా మాత్రం ప్రజల సమస్యలే. అందుకే మాక్ అసెంబ్లీనిర్వహించి, ప్రజల ద్వారా, మీడియాద్వారా ప్రభుత్వమెడలు వంచాలని నిర్ణయించాము.

Advertisements

Advertisements

Latest Articles

Most Read