అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలకు పరిష్కారంచూపే చర్చా వేదికని, దేవాలయం లాంటి అసెంబ్లీని జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్ లా, వైసీపీ కార్యాలయంలా మార్చేశాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానా యుడు ఆరోపించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు "ఒకరోజు అసెంబ్లీని నిర్వహిస్తున్నారు. మార్చినెలలో బడ్జెట్ సమావేశాలు జరపొచ్చు. ఏపీలో మార్చి నెలలో పెద్దగా క-రో-నా కేసులు కూడా లేవు. కేంద్రం పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించింది. పొరుగున ఉన్న కర్ణాటక ప్రభుత్వం కూడా బడ్జెట్ సమావేశాలు నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బడ్జెట్ సమావేశాలు పెట్టకుండా, దొంగచాటుగా ఆర్డినెన్స్తో బడ్జెట్ ను ఆమోదింప చేసుకున్నారు. కేవలం రాజ్యాంగపరమైన నిబంధనలతో తన ప్రభుత్వం ఎక్కడ కూలిపోతోందోనన్న భయంతోనే ముఖ్యమంత్రి ఇప్పుడు ఒకరోజు బడ్జెట్ సమావేశాలకు సిద్ధమయ్యాడు. రాజ్యాంగప రమైన విధానాలు, బడ్జెట్ ను ఆమోదింప చేసుకోవడానికే తాము సమావేశాలు పెడుతున్నట్లు నిస్సిగ్గుగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెండేళ్లపా టు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ముఖమే చూడలేదు. అసెంబ్లీ అంటే ఏమాత్రం గౌరవంలేకుండా వ్యవహరించాడు. ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా అదేవిధమైన నిర్లక్ష్యంతో ఉన్నాడు . అందుకే మొక్కుబడిగా ఒక్కరోజు బడ్జెట్ సమావేశాల నిర్వహణ చేపట్టాడు. ప్రజల సమస్యలపై ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో చెప్పడానికి మొక్కుబడిగా నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాలే నిదర్శనం. అందుకే తెలుగుదేశంపార్టీ ఒకరోజు నిర్వహిస్తున్న అసెంబ్లీని బాయ్ కాట్ చేయాలని నిర్ణయించింది. దానికి సమాంతరంగా ప్రభుత్వతీరుని నిరసిస్తూ, ప్రజల సమస్యలే ప్రధాన అజెండాగా మాక్ అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించాము. దానిలో భాగంగా నేడు బీఏసీ సమావేశం కూడా నిర్వహించాము. ఆ సమావేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక అజెండాను నిర్ణయించాము.

మాక్ అసెంబ్లీని రెండు రోజులు పాటు నిర్వహించాలని, ప్రధానంగా కో-వి-డ్ అంశంపై చర్చ చేపట్టాలని, ప్రభుత్వం ప్రజల ప్రాణాల విషయంలో వ్యవహరిస్తున్న తీరుని ఎండగట్టాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించాము. మాక్ అసెంబ్లీలో తొలిరోజు ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దుచేసి, కోవిడ్ అంశంపైన చర్చ సాగాలని నిర్ణయం తీసుకున్నాము. దానిపై అవసరమైతే వాయిదా తీర్మానం కూడా ఇవ్వాలనుకుంటున్నాము. స్పీకర్ కు తమ పార్టీ నుంచి వాయిదా తీర్మానం పంపించి, దాన్నిఆయన అనుమతించేలా చూస్తాము. ప్రభుత్వం కో-వి-డ్ నివారణలో ఘోరంగా విఫలమైంది. పడకలు, ఆక్సిజన్ దొరక్క ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. కో-వి-డ్ తొలిదశ, రెండోదశకు ఆరునెలల విరామం ఉన్నా కూడా ప్రభుత్వం తగినవిధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టలేకపో యింది. అలానే చేతివృత్తులు, కులవృత్తుల వారిని ఆదుకునేలా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదు. మాక్ అసెంబ్లీలో రెండోరోజు ప్రశ్నోత్తరాల సమయానికి కేటాయిస్తాం. దానిలో పింఛన్ల అంశంపై జగన్మోహన్ రెడ్డి ఎలా ప్రజలను మోసగించాడో చర్చిస్తాం. వారంరోజులలో సీపీఎస్ రద్దు చేస్తానన్న పెద్దమనిషి రెండేళ్లైనా దానిఊసేత్త డంలేదు. అదేవిధంగా బ్రాహ్మణులు, బీసీలు, కాపులు, వైశ్యులు, ఎస్సీ,ఎస్టీల కార్పొరేషన్లు ఎలా నిర్వీర్యమాయ్యాయో కూడా మాక్ అసెంబ్లీలో చర్చించబోతున్నాం. వాటితో పాటు దిశా పోలీస్ స్టేషన్లు, రాష్ట్రంలో మహిళలకు అందుతున్న న్యాయంపై కూడా చర్చిస్తామన్నారు. ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే బుల్లెట్ కంటే వేగంగా జగన్ వస్తాడనిచెప్పారు. మరిప్పుడు జగన్ ఇంటినుంచే బయటకు రావడంలేదు. ప్రభుత్వం రెండేళ్లలో అనేకఅంశాల్లో ఘోరంగా విఫలమైంది. వాటిలో అతిముఖ్య మైనది రైతులు, వ్యవసాయరంగం. దానిపై కూడా ప్రధానంగా చర్చించేలా ప్రణాళిక ఏర్పాటుచేస్తున్నాం. వాటన్నింటిపై చర్చించడానికి తమకు కూడా రెండురోజుల సమయం సరిపోదు. వైసీపీప్రభుత్వంలో అంకెలగారడీగా మారిన బడ్జెట్ పై కూడా మాక్ అసెంబ్లీలోచర్చిస్తాం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read