కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో, ఎంపీ రఘురామకృష్ణం రాజు కుటుంబ సభ్యులు కొద్ది సేపటి క్రితం కలిసారు. రఘురామకృష్ణం రాజు అరెస్ట్ దగ్గర నుంచి, ఆర్మీ హాస్పిటల్ తరలింపు వరకు జరిగిన ఘటనలు అన్నిటిపైనా ఆయనకు ఒక ఫిర్యాదు రూపంలో ఒక మెమోరాండం ఇచ్చారు. ఈ భేటీలో రఘురామ రాజు భార్య రామాదేవి, కుమారుడు భరత్ పాల్గున్నారు. గతంలోనే రఘురామరాజు కుమారుడు భారత్, కేంద్రం హోం శాఖకు, ప్రధాని మోడీకి, తన తండ్రి అక్రమ అరెస్ట్ పై ఒక లేఖ కూడా రాసారు. అందులో రఘురామరాజు అరెస్ట్ వెనుక దాగి ఉన్న ఉద్దేశాలను, రఘురామరాజును పోలీస్ కస్టడీలో కొ-ట్ట-టం పైన, అలాగే తన తండ్రికి ప్రాణ హాని ఉంది అంటూ, ఇప్పటికే లేఖ రాసి ఉన్నారు. ఆ తరువాత సుప్రీం కోర్టులో కూడా పిటీషన్ దాఖలు చేసారు. ఈ నేపధ్యంలోనే రఘురామరాజు భార్య రమాదేవి, కుమారుడు భరత్ కలిసి ఢిల్లీకి వచ్చారు. అమిత్ షా ని కలిసి, మొత్తం జరిగిన విషయం పై ఫిర్యాదు చేసారు. అక్కడ జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు ఎండగడుతున్నారనే, ఆయన పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా, దేశద్రోహం కేసు పెట్టారని, ఇందులో దేశ ద్రోహం కేసు పెట్టే తప్పు ఏమి ఉందని అమిత్ షా కి చెప్పారు. అలాగే రెండు తెలుగు చానల్స్ ను కూడా ఇందులో ఇరికించారని, అమిత్ షా దృష్టికి తెచ్చారు.

rrr 119052021 2

రాజ్యాంగం ప్రకారం నడుచుకోకుండా, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారని, కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా, హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు తీసుకుని వచ్చారని, అలాగే కస్టడీలో ఆయనను కట్టేసి కాళ్ళ పై కొ-ట్టా-ర-ని, తరువాత కోర్టులలో ప్రైవేటు హాస్పిటల్ లో వైద్య పరీక్షలు చేయాలని చెప్పినా, పరీక్షలు చేయకుండా మళ్ళీ జైలుకు తరలించారని అమిత్ షా కు చెప్పూరు. సుప్రీం కోర్టు ఆదేశాలు ప్రకారమే, ఆర్మీ హాస్పిటల్ కు తరలించారని అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ లో ఇచ్చిన రిపోర్ట్ ని కూడా, ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు, రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారని తెలిపారు. ఈ విషయాలు అన్నీ అమిత్ షా దృష్టికి తీసుకుని వచ్చి, తగు న్యాయం చేయాలని కోరారు. అమిత్ షా కూడా, ఇవన్నీ విని, రాష్ట్ర ప్రభుత్వ డీజీపీ నుంచి, చీఫ్ సెక్రటరీ నుంచి, తగు నివేదికలు తెప్పించుకుంటానని అన్నారు. మరి కొంత మంది కేంద్ర మంత్రులను, అలాగే కొంత మంది అధికారులను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read