ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రఘురామకృష్ణం రాజు వ్యవహారంలో కోర్టు ఉత్తర్వులను అమలు చేయనందుకు, సుమోటోగా కేసుని స్వీకరించి, దీని పై వెంటనే సిఐడి అడిషనల్ డీజీతో పాటు, మరో సిఐడి ఆఫీసర్ కు, కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రఘురామకృష్ణం రాజు వ్యవహారంలో, గుంటూరులో ఉండే సిఐడి మ్యజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన, ఉత్తర్వులను రద్దు చేయాలని చెప్పి, ఏపి హైకోర్టులో సిఐడి తరుపున లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. లంచ్ మోషన్ పిటీషన్ పై, విచారణ జరిగినా, అప్పటికే సుప్రీం కోర్టులో కేసు ఉండటంతో, దీన్ని తరువాత విచారణ చేద్దామని ఈ రోజుకి వాయిదా వేసారు. ఈ రోజు లంచ్ మోషన్ పిటీషన్ పై విచారణ ప్రారంభం అయ్యింది. ఈ విచారణ సందర్భంగా, అటు ప్రభుత్వానికి హైకోర్టుకి మధ్య వాడీ వేడిగా వాదనలు జరిగాయి. ప్రధానంగా సిఐడి మ్యజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ రద్దు చేయాలని మీరు అడిగే ముందు, హైకోర్టు, సిఐడి మ్యజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు మీరు ఎందుకు అమలు చేయలేదో సమాధానం చెప్పాలని చెప్పి హైకోర్టు ప్రశ్నించింది. అదే విధంగా సిఐడి మ్యజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కూడా అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చినా, రాత్రి పది గంటలకు ఆదేశాలు మీకు అందినా, తరువాత రోజు రమేష్ హాస్పిటల్ కు ఎందుకు తీసుకుని వెళ్ళలేదు అని కూడా హైకోర్టు నిలదీసింది. సిఐడి మ్యజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నది ఉన్నట్టు అమలు చేయాలని హైకోర్టు తమ ఉత్తర్వుల్లో పేర్కొంటే, మీరు తప్పనిసరిగా స్పందించాలి కదా అని ప్రశ్నించింది.

hc 19052021 2

అదే విధంగా సిఐడి మ్యజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టుకు రాబోయే ముందు, వాటిని ఫోర్సు లో ఉండాల్సిందిగా భావించాల్సి ఉంటుందని, సిఐడి మ్యజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ముందుగా ప్రభుత్వ హాస్పిటల్ కు, ఆ తరువాత రమేష్ హాస్పిటల్ కు తీసుకుని వెళ్లి వైద్య పరీక్షలు చేయాలని ఆదేశాలు ఉన్నాయి కదా అని హైకోర్టు గుర్తు చేసింది. అటు సిఐడి మ్యజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు, ఇటు హైకోర్టు ఉత్తుర్వలు అమలు చేయకుండా, ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే దీని పై వెంటనే సుమోటో గా తీసుకుని, వెంటనే కోర్టు ధిక్కరణ నోటీసులు ఇవ్వాలని, రిజిస్టార్ ని ఆదేసించి, సిఐడి అడిషనల్ డీజీతో పాటు, సిఐడి స్టేషన్ ఆఫీసర్ ని కూడా వెంటనే కోర్టు దిక్కరణ నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. పౌరుల ప్రాధమిక హక్కులు భంగం కలిగినప్పుడు, కోర్టులు ఇలానే స్పందిస్తుంది అని కూడా వ్యాఖ్యానిస్తూ, దీని పై ఇక రెండో వాదనకు ఆస్కారం లేదు అంటూ, కోర్టు ధిక్కరణ కింద నోటీసులు ఇస్తున్నామని చెప్పింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read