అయ్యా! నర్సాపురం పార్లమెంటు సభ్యులు కె.రఘురామకృష్ణంరాజు గారు గత కొంతకాలంగా రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలపై ప్రసార మాధ్యమాల ద్వారా తమ స్పందనను తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో భావప్రకటనా స్వేచ్చకు లోబడే ఆయన తమ వాణిని విన్పించారు. ఇందుకుగాను మీ అధీనంలోని సిఐడి పోలీసులు ఆయన చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని ఏకంగా రాజద్రోహం నేరం మోపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఈనెల 14వతేదీన మీ అధీనంలో 30మంది సిఐడి పోలీసులు మూకుమ్మడిగా హైదరాబాద్ లోని రఘురామ ఇంటికి వెళ్లి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఆయనను నేరుగా అరెస్ట్ చేశారు. అదే రోజు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు రఘురామకృష్ణంరాజును గుంటూరులోని సిఐడి కార్యాలయంలో అయిదుగురు ముసుగులు ధరించిన సిఐడి పోలీసులు తనను కర్రలతో విచక్షణారహితంగా కొ-ట్టి-న-ట్లు రఘురామకృష్ణంరాజు మెజిస్టేట్ కు ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. ఈనెల 15వతేదీన రఘురామకృష్ణంరాజును సిఐడి పోలీసులు కోర్టులో హాజరుపర్చిన సందర్భంగా తన వంటిపై ఉన్న దె-బ్బతిబ్బలను మెజిస్ట్రేట్ కు చూపించారు. దీనిపై స్పందించిన మేజిస్ట్రేట్ ఆయనకు గుంటూరు ప్రభుత్వాసుపత్రితోపాటు రమేష్ ఆసుపత్రిలో కూడా వైద్యపరీక్షలు నిర్వహించాలని స్పష్టంగా చెప్పారు. ఈనెల 16వతేదీన గుంటూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతి నేతృత్వంలోని మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించిన సిఐడి పోలీసులు...కోర్టు ఉత్తర్వులు పూర్తిగా అమలు చెయ్యకుండా నే హడావిడిగా రఘురామకృష్ణంరాజును జిల్లాజైలుకు తరలించారు.

achem 16052021 2

దీనిపై ఆదివారం రాత్రి రాష్ట్ర హైకోర్టు స్పందిస్తూ సిఐడి కోర్టు ఆదేశించిన విధంగా రఘురామరాజును వైద్యపరీక్షల నిమిత్తం రమేష్ హాస్పటల్ కు తరలించాలని ఆదేశించింది. అటు హైకోర్టు, ఇటు సిఐడి కోర్టు ఉత్తర్వులను సైతం మీ అధీనంలోని సిఐడి పోలీసులు లెక్కచేయడం లేదు. ఇటీవల సంగ డెయిరీ చైర్మన్ ధూళిపాళ నరేంద్ర విషయంలో కూడా న్యాయస్థానానికి సమాచారం లెకుండా రాజమండ్రి జైలుకు తరలించారు. రఘురామకృష్ణంరాజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి తనకు ప్రా-ణ-హా-ని ఉందని డిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి కేంద్ర హోంశాఖ ద్వారా వై-కేటగిరి భద్రత పొందారు. ఇప్పుడు రాష్ట్రప్రభుత్వం, సిఐడి వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఎంపి రఘురామకు ప్రా-ణ-హా-ని ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. తాజాగా ఆయన భార్య కూడా తన భర్తకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. సిఐడి కోర్టు ఆదేశాలకు విరుద్దంగా రమేష్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించకుండా జైలుకు తరలించడం దుర్మార్గం. రఘురామ రాజు ప్రాణాలకు పూర్తి భద్రత కల్పించాలి. అయన ప్రాణానికి ముప్పువాటిల్లితే ముఖ్యమంతిగా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇట్లు, కింజారపు అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు

Advertisements

Advertisements

Latest Articles

Most Read