దేశ వ్యాప్తంగా క-రో-నా కేసుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోందని, ఒక్కరోజుకి 4లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి నానాటికీ ఎంతలా దిగజారిపోతోందో ప్రతిఒక్కరూ ఆలోచనచేయాలని, ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా భారత్ లోనే నమోదవుతున్నాయని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వివరించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... "మన రాష్ట్రంలో నిన్న దాదాపు 21వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. టెస్టింగ్ ప్రక్రియను పెంచితే కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. పాజిటివిటీ రేట్ ను కచ్చితంగా తెలుసుకునే అవకాశ ముంటుంది. 18 నుంచి 45ఏళ్ల వయస్సువారికి సెప్టెంబర్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలు పెడతామన్న రాష్ట్రప్రభుత్వ ప్రతిపాదనను, కేంద్ర ప్రభుత్వం తాజాగా తోసిపుచ్చడం జరిగింది. విధిగా 18 – 45ఏళ్ల మధ్య వయస్సు వారికి క-రో-నా వ్యాక్సిన్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేయడం జరిగింది. నిన్న క-రో-నా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మాట్లాడారు. ఆక్రమంలో ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోకూడా మాట్లాడారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి , కేంద్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేశారు? వ్యాక్సిన్లు, ఆక్సిజన్ సరఫరా గురించి తమకు ఇంత కావాల్సిందేనని ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఏమైనా అడిగారా? లేదా? వందలాదిమంది ఆక్సిజన్ లేక చనిపోతుంటే, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తాపీగా, ఆక్సిజన్ క్రయోజనిక్ ట్యాంకర్ల కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చామని చెప్పడం చాలా బాధగా ఉంది. రెండోపక్కన మిగతా రాష్ట్రాలతో పోలిస్తే, ప్రభుత్వం కేవలం 13లక్షల వ్యాక్సిన్ల కొనుగోలుకు మాత్రమే ఆర్డర్ పెట్టడమేంటి? అనేక రాష్ట్రాలు కోట్లసంఖ్యలో వ్యాక్సిన్ల కొనుగోలుకు ఆర్డర్ పెడుతుంటే, ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై నిందలేస్తోంది.

వ్యాక్సిన్ల కొనుగోలుకు కేంద్రం అనుమతివ్వట్లేదని, సహకరించడం లేదని జగన్ రెడ్డి సర్కారు చెబుతున్నదంతా పచ్చి అబద్ధం. వ్యాక్సిన్ తయారీ కంపెనీల నుంచి నేరుగా రాష్ట్రాలే వ్యాక్సిన్లు కొనుగోలు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే రాష్ట్రప్రభుత్వం 13లక్షల వ్యాక్సిన్ల కొనుగోలుకు ఆర్డర్ పెట్టిందా అని నిన్న ప్రభుత్వాన్ని తాను ప్రశ్నించడం జరిగింది. దానిపై దొంగపత్రిక సాక్షిలో కేంద్ర ప్రభుత్వమేదో రాష్ట్రానికి లేఖ రాసిందని చెబుతూ దాన్ని ప్రచురించారు. ఆ లేఖను ఒక్కసారి పరిశీలిస్తే, రాష్ట్రప్రభుత్వం ఎక్కడా వ్యాక్సిన్ల కొనుగోలుకు కేంద్రాన్ని అనుమతి కోరినట్లుగానీ, కేంద్రం ఎక్కడా అనుమతి ఇస్తున్నట్టు గానీ లేదు. ప్రభుత్వంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులు, మంత్రులకు, సాక్షి పత్రిక వారికి ఇంగ్లీష్ భాష తెలియనట్టు ఉంది. మాట్లాడితే ఇంగ్లీష్ మీడియం.. ఇంగ్లీష్ మీడియం అంటుంటారు కదా? ఇంగ్లీషు లోఉన్న లేఖలోని సారాంశం ఏమిటో తెలుసుకోకుండా, ఏది పడితే అది దొరికింది కదా అని పత్రికలో ప్రచురిస్తే ఎలా? మీకు ఇంగ్లీష్ రాకపోతే, ఇంగ్లీష్ బోధించే మాస్టార్ దగ్గరకి వెళ్లి నేర్చుకోండి. సాక్షిలోప్రచురించిన లేఖలో ఏముందంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలే నేరుగా వ్యాక్సిన్ తయారీ కంపెనీల నుంచి వ్యాక్సిన్లు కొనుగోలుచేయవచ్చని స్పష్టంగా ఉంది.

ఆ విషయం దొంగపత్రికైన సాక్షి యాజమాన్యానికి అర్థమైనట్లులేదు. రాష్ట్రాలకు, ప్రైవేట్ ఆసుపత్రుల వారికి పెద్దఎత్తున వ్యాక్సిన్లు కొనుగోలు చేసేందుకు తాము వెసులుబాటు కల్పిస్తున్నట్లు సదరు లేఖలో కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ స్పష్టంచేసింది. కేంద్రం వ్యాక్సిన్ల కొనుగోలుకు రాష్ట్రాలకు స్వేఛ్ఛఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోయేసరికి, ఇప్పటివరకు వ్యాక్సిన్ల కొనుగోలుకు ఎటువంటి ఆర్డర్లు పెట్టకపోయేసరికి కేంద్రప్రభుత్వం స్పందించి, తనకు తానుగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. పనికిమాలిన ప్రభుత్వం వ్యాక్సిన్ల కొనుగోలు దిశగా ఎటువంటి చర్యలు తీసుకోకపోయేసరికి, కేంద్ర ప్రభుత్వమే మానవత్వంతో స్పందించి, ఈ ప్రభుత్వానికి తన బాధ్యతను గుర్తుచేస్తూ లేఖ రాసింది. రాష్ట్రప్రభుత్వాలే నేరుగా వ్యాక్సిన్ తయారీ కంపెనీల నుంచి వ్యాక్సిన్లను కొనుగోలుచేయవచ్చని సదరు లేఖలో కేంద్రప్రభుత్వం పేర్కొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read