అమరరాజా కంపెనీ మూసివేతకు సంబంధించి, ఈ రోజు హైకోర్టులో ఊరట లభించింది. అమరరాజా బ్యాటరీస్ కి సంబంధించిన, సంస్థలు మూడింటిని మూసివేయాలని చెప్పి, ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మూడు రోజులు క్రితం, అమరరాజా సంస్థలకు నోటీసులు ఇవ్వటమే కాకుండా, ఏకంగా కరెంటు సరఫరా కూడా నిలిపివేశారు. ఈ నేపధ్యంలోనే, అమరరాజా సంస్థ హైకోర్టులో పిటీషన్ వేసి, హైకోర్టుని ఆశ్రయించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేసారు. దీని పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. దీని పై ఈ రోజు హైకోర్టు ఆదేశాలు ఇస్తూ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జారీ చేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ, ఆదేశాలు ఇచ్చింది. వెంటనే విద్యుత్ ని పునరుద్ధించాలని కూడా ఆదేశాలు జారీ చేయటమే కాకుండా, జూన్ 17వ తేదీ లోపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సూచనలు అమలు చేయాలని చెప్పి, అమరరాజా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమైతే సూచనలు చేసిందో, వాటి అన్నిటినీ కూడా, తాము అమలు చేస్తున్నామని, ఇంకేమైనా వారు సూచించినా కూడా, వాటిని అమలు చేస్తామని, అమరరాజా సంస్థ హైకోర్టుకు తెలిపింది. అమరరాజా సంస్థకు కార్పొరేట్ నిబంధనలు పాటించటంలో గుర్తింపు ఉందని కోర్టుకు తెలిపారు.
అలాగే ఉద్యోగుల, కార్మికల శ్రేయస్సు గురించి పాటించటంలో కూడా, పొల్యూషన్ నిబంధనలు పాటించటంలో కూడా గతంలో అనేక అవార్డులు వచ్చిన చరిత్ర ఉందని తెలిపారు. అయితే ఇంత చరిత్ర ఉన్న కంపెనీని మూసివేయాలని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన ఆదేశాలు తీవ్ర సంచలనం రేకెత్తించాయి. నిన్న కడప జిల్లాలో జువారి సిమెంట్స్ మూసివేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన ఆదేశాలను కూడా హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు అమరరాజా సంస్థలను కూడా మూసివేయాలని కూడా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన ఆదేశాలను కూడా, రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను, జూన్ 28వ తేదీకి వాయిదా వేసింది. మళ్ళీ రిపోర్ట్ ఫైల్ చేయాలని కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కు, ఏపి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే జూన్ 17 లోపు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని, అమరరాజా సంస్థకు హైకోర్ట్ సూచనలు ఇచ్చింది.