తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో ఉన్న చంద్రబాబు, ఈ రోజు రావూరులో ఎన్నికల ప్రచారం చేసారు. భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు.. సీఎం పదవి తనకు కొత్త కాదు.. తన రికార్డు ఎవ్వరూ బద్దలు కొట్టలేరు.. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.. తిరుపతి ఉప ఎన్నికల ద్వారా మంచి తీర్పును ఇచ్చి పనబాక లక్ష్మిని మంచి మెజార్టీతో గెలిపించుకుందాం.. మీ ఉత్సాహం, - కేరింతలు చూస్తుంటే కడుపు నిండిపోతుందని అన్నారు.. పార్లమెంట్లో టీడీపీ బలాన్ని పెంచే విధంగా అడుగులు వేద్దాం.. కక్ష్య సాధింపులతో నీచమైన పరిపాలన అందిస్తూ ఆకాశంలో తిరుగుతున్న జగన్ రెడ్డికి బుద్ధి చెప్పి వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించాల్సిన సమయం ఆసన్నమయ్యిందని చంద్రబాబునాయుడు తెలుగు తమ్ముళ్లకు పిలుపును ఇచ్చారు. భారత రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న జగన్ రెడ్డికి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి ఏ ఒక్కరిని వదిలి పెట్టకుండా ముద్దులు పెట్టి అధి కారంలోకి వచ్చిన తర్వాత పిడిగుద్దులు గుద్దుతూ పాలన సాగిస్తున్నారన్నారు. అందరినీ వెన్నుపోటు పొడిచిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఓ వైపు క-రో-నా కారణంగా ఆదాయం తగ్గిపోయి అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతుంటే ధరలు మోత మోగిస్తూ నీచ పరిపాలన సాగిస్తున్న జగన్ రెడ్డి అమ్మ ఒడి ద్వారా రూ 15వేలు తల్లి ఖాతాలో వేసినాన్న బుడ్డీరూ 30వేలు చేసి దోచుకుంటున్నారన్నారు. ప్రజలకు గోరంత ఇచ్చి కొండంత దోచుకుంటున్నారని విమర్శించారు. ఉపాధ్యాయులను బ్రాందీషాపుల వద్ద ఉంచి మద్యం అమ్మకాలు సాగించిన జగన్ రెడ్డి గురువు పవిత్రతను అపవిత్రం చేశారన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఏ విధంగా జరిగాయో అందరికీ తెలుసన్నారు.
సర్పంచ్ ఎన్నికలు సైతం ఏ విధంగా చేసుకున్నారో ప్రత్యక్షంగా చూశామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఏది చెబితే పోలీసులు అది అమలు చేశారన్నారు. సొంత చిన్నాన్న వైఎస్ వివేక్ హ-త్య-కు గురైతే అప్పట్లో సాక్షి పత్రికలో గుండెపోటుతో చనిపోయాడని బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారన్నారు. ఆ తర్వాత సాక్ష్యాలు తారుమారు చేశారన్నారు. ఆ సమయంలో వివేకనందరెడ్డి కుమార్తె తనకు ఫోన్ చేసి తమ నాన్న మృతిపై అనుమానాలు ఉన్నా యని చెప్పారన్నారు. గొడ్డలితో న-రి-కి చం-పి-చ-న-ట్లు-గా తేలిందన్నారు. ఆ నింద తనమీద వేసి జగన్‌రెడ్డి ఆరోపణలు చేశారన్నారు. ఇప్పటికీ చిన్నాన్నను చం-పి-న దోషులెవ్వరో తేల్చలేదన్నారు. సొంత చిన్నాన్నను చం-పి-న వ్యక్తులను కాపాడుతున్న జగన్ రెడ్డికి ప్రజలు ఓ లెక్క అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను అణగదొక్కాలని చూస్తే తిరుగుబాటు చేసి తగిన బుద్ధి చెబుతామన్నారు. క-రో-నాపై దృష్టి సారించని జగన్ రెడ్డి కక్ష్య సాధింపు చర్యలకు దిగడం నీచం అన్నారు. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా రిలీజ్ కాకుండా అడ్డుకున్న జగన్ రెడ్డి మిగిలిన సినిమాలను ఎందుకు అడ్డుకోలేదో వాటికి ఎందుకు రాయితీలు ఇచ్చారో చెప్పాలన్నా రు. పవన్ కళ్యాణ్ పై అంత కక్ష్య ఎందుకో చెప్పాలన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కక్ష్య సాధింపు చర్యలకు తాను పాల్పడి ఉంటే జగన్ రెడ్డి బయట కాలు పెట్టేవారు కాదన్నారు. సొంత పార్టీ ఎంపీ రఘు రామరాజు తనకు ప్రాణహాని ఉందని కేంద్రానికి లేఖ రాశారంటే జగన్ రెడ్డి ఎలాం టి పరిపాలన అందిస్తున్నారో ప్రజలంతా గమనించాలన్నారు.
నాసిరకం బ్రాందీలను ప్రజలచేత తాగించి దానికి మద్యపాన నిషేధమని పేరుపెట్టి ఆ మద్యం ద్వారా వేలకోట్లు సంపాదిస్తున్నారన్నారు. జగన్ రెడ్డి దోపిడి రాజ్యం కారణంగా 40 లక్షల మంది భవన కార్మికులు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రత్యేక హోదా అన్న విషయాన్ని జగన్ రెడ్డికి గుర్తు ఉందా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధన కోసం తన పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు. జగన్ రెడ్డి పరిపాలన పై చర్చకు సిద్ధం అని, ఎవరు వస్తారో రావాలని సవాల్ విసిరారు. ప్రతి ఒక్కరు ఆలోచన చేసి చరిత్రను సృషించే విధంగా తిరుపతి ఉప ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన పనబాక లక్ష్మిని నిండు మనస్సుతో ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోడ్ షోకు వేలాదిగా పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావడంతో ఈ రోడ్ షో విజయ వంతం అయ్యింది. అయితే పెద్దిరెడ్డి సవాల్ కు చంద్రబాబు పరోక్షంగా స్పందించారు. రాజకీయాలు కాదని, ప్రత్యేక హోదా కోసం, రాజీనామాలు చేయటానికి సిద్ధం అని, మీరు సిద్ధమా అని సవాల్ విసిరారు.