తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గునబోవటంలేదని, ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. క-రో-నా కారణంగా రాలేకపోతున్నా అంటూ జగన్ మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే అంతకు ముందు జగన్ మోహన్ రెడ్డి సభకు మంచి హైప్ ఏర్పడింది. లోకేష్ చేసిన చాలెంజ్ కు జగన్ ఏమి సమాధానం చెప్తారా అని అందరూ వైట్ చేసారు. అయితే అనూహ్యంగా, క-రో-నా సాకుతో జగన్ మోహన్ రెడ్డి, పర్యటన రద్దు చేసుకున్నారు. అయితే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా, రేపు జరగబోయే తిరుపతి సభకు రావటం లేదని తెలుస్తుంది. ఇప్పటి వరకు అధికారింగా దీని పై చెప్పకపోయినా, ఇప్పటికే పవన్ హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు, జనసేన ప్రకటించింది. దీంతో పవన్ కళ్యాణ్ కూడా రేపు సభకు రావటం లేదనే అనుకోవాలి. నిజానికి రేపు నెల్లూరు జిల్లా నాయుడు పేటలో, పవన్ సభ ఉంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్ష్యుడు జేపీ నడ్డా కూడా వస్తున్నారు. ఇదే మీటింగ్ లో పవన్ కూడా పల్గునవలసి ఉంది. పవన్ కళ్యాణ్, నడ్డా కలిసి రోడ్ షో చేసి, మీటింగ్ పెడతారని, దీన్ని భారీ ఎత్తున చేయాలని బీజేపీ భావించింది. అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ హోం ఐసోలేషన్ లో ఉన్నట్టు, జనసేన పార్టీ నుంచి, కొద్ది సేపటి క్రితమే ప్రెస్ నోట్ విడుదల అయ్యింది.
ఈ ప్రెస్ నోట్ లో, పవన్ కళ్యాణ్ మ్యానేజర్లు, సెక్యూరిటీతో పాటుగా వ్యక్తిగత సిబ్బందిలో చాలా మందికి క-రో-నా వచ్చిందని తెలిపారు. అందుకే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, డాక్టర్ల సూచన మేరకు, పవన్ కళ్యాణ్ కూడా, హోం క్వారాన్టైన్ లో ఉంటున్నారని ఆ ప్రకటన లో తెలిపారు. గత వారం రోజులుగా పవన్ చుట్టూ ఉండే ఒక్కోక్కరూ క-రో-నా బారిన పడుతూ వస్తున్నారని ఆ ప్రెస్ నోట్ లో తెలిపారు. వీరు పవన్ కు అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తులని తెలిపారు. దీంతో ముందు జాగ్రత్తగానే పవన్ కళ్యాణ్ కూడా క్వారన్టైన్ లోకి వెళ్లిపోయారని తెలిపారు. అయితే పవన్ రోజు వారీ విధులు నిర్వహిస్తున్నారని, పార్టీ కార్యకలాపాలు కూడా చూస్తున్నారని, టెలి కాన్ఫెరెన్స్ ద్వారా పార్టీ ముఖ్యులతో మాట్లాడుతున్నారని తెలిపారు. అయితే ఈ విషయం తెలియటంతో, బీజేపీ డీలా పడింది. రేపు జరగబోయే ఎన్నికల ప్రచారానికి పవన్ రావటం ఇక అసాధ్యమే అని తెలియటంతో, రేపు పవన్ లేకుండా, కేవలం బీజేపీ నేతలతో మీటింగ్ చేయనున్నారు.