ఈనెల 11 నుంచి 14 వరకు దేశంలో నిర్వహించ తలపెట్టిన కో-వి-డ్ వ్యాక్సిన్ ఉత్సవ్ కు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని జగన్మోహన్ రెడ్డి శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపడుతున్న ఈ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు 25 లక్షల డోసుల వ్యాక్సిన్ అవసరం ఉందని లేఖలో తెలిపారు. ఇప్పటివరకు రెండు లక్షల డోసుల వ్యాక్సిన్ను వినియోగిస్తుండగా మరో 2 లక్షల డోసుల వ్యాక్సిన్ శుక్రవారం నాటికి రాష్ట్రానికి అందుబాటులోకి వచ్చిందన్నారు. వ్యాక్సిన్ ఉత్సలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 4 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలు..మొత్తం రోజుకు 6 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. కో-వి-డ్ మహమ్మారిని అంతమొం దించేందుకు వీడియో కాన్ఫరెన్ల ద్వారా మీరందించే సలహాలు, సూచనలు, ఆదేశాలను రాష్ట్రంలో పాటిస్తున్నామని జగన్ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ సరిపోదనీ, మరో 25 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కో-వి-డ్ నివారణ కోసం ఏపీ అవసరాలనూ, ప్రభుత్వం చేపడుతున్న చర్యలను దృష్టిలో ఉంచుకుని వ్యాక్సిన్ పంపిణీకి చొరవ తీసుకోవాల్సిందిగా ఆయన ప్రధానమంత్రిని కోరారు.
మీ ఆదేశాలు, సలహాలు, సూచనలు పాటిస్తున్నాం, కొంచెం చొరవ తీసుకోండి అంటూ, ప్రధాని మోడికి, జగన్ లేఖ...
Advertisements