ఆంధ్రప్రదేశ్ లో మరో పెను సంచలనానికి దారి తీసే ఘటన ఇది. మాజీ ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వేంకటేశ్వర రావు సంచలన ఆరోపణలు చేస్తూ, సిబిఐ ఎంక్వయిరీ కోరుతూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి లేఖ రాసారు. ఇప్పటికే ఏబీ వేంకటేశ్వర రావు పై, దేశ ద్రోహం ఆరోపణలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే, ఏబీ వేంకటేశ్వర రావు, చీఫ్ సెక్రటరీకి తొమ్మిది పేజీల లేఖ రాసారు. అందులో కొన్ని సంచలన విషయాలు పొందు పరిచారు. ఏకంగా డీజీపీ తన స్వహస్తాలతో ఫోర్జరీ చేసినట్టు తన వద్ద ఉన్న ఆధారాలు, ఆ లేఖకు జత పరిచారు. అంతే కాదు, డీజీపీ గౌతమ్ సవాంగ్ తో పాటుగా, సీఐడీ అదనపు డీజీపీ సునీల్ కుమార్, ఏసీబీ డీజీ సీతా రామాంజనేయులు, ఇంటలిజెన్స్ విభాగపు అధికారులతో పాటు, మిగతా వారి ప్రమేయం పై కూడా, ఆధారాలు ఆ లేఖలో ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా సచివాలయంలోని అధికార వర్గాల్లో కలకలం రేగింది. ఏకంగా డీజీపీ, సిఐడి చీఫ్, ఏసిబీ చీఫ్ ఫోర్జేరి చేసారు అంటూ, ఆధారాలు ఇవ్వటం, పెను సంచలనం అనే చెప్పాలి. ఏబీ వేంకటేశ్వర రావు డీజీ ర్యాంకు అధికారి, ఆయన చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే, ఇది దేశంలోనే సంచలనానికి దారి తీస్తుంది. ఒక వేళ ఆయన చేసిన ఆరోపణలు నిజం కాకపోతే, వెంటనే ఆ అధికారులు అందరూ వచ్చి, నిజం ప్రజలకు చెప్పాలి.

abv 100442021 2

ఇప్పటికే ఏబీ వేంకటేశ్వర రావు గత వారం కమీషనర్ అఫ్ ఎంక్వయిరీస్ విచారణ సందర్భంగా, మీడియాతో మాట్లాడిన ఆయన, తన పై తప్పుడు కేసు పెట్టారని, అంతే కాకుండా, దొంగ డాక్యుమెంట్లు సృష్టించారని, వాటిని తొందర్లోనే బయట పెడతాను అంటూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఆరోపణలుకు సంబంధించి, పూర్తి వివరాలు ఆ లేఖలో ఇచ్చారు. అయితే దీని పై తనకు సిబిఐ ఎంక్వయిరీ కావాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలో తెలిపారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోక పొతే, కోర్టుకు కూడా వెళ్ళే ఆలోచనలో ఏబీ వేంకటేశ్వర రావు ఉన్నారు. ఇప్పటికే ఆయన కేసు సుప్రీం కోర్ట్ లో ఉంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారమే, ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఏప్రిల్ చివరి లోపు విచారణ ముగించాలని సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. ఈ తరుణంలో, ఇప్పుడు ఏకంగా డీజీపీ, ఏసిబీ, సిఐడి తన పై దొంగ పత్రాలు సృష్టించారు అంటూ, ఏబీ వేంకటేశ్వర రావు చేసిన ఆరోపణలు, ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. మరి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి రియాక్షన్ ఉంటుందో చూడాలి.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read