సంగం డయిరీ చైర్మెన్, టిడిపి సీనియర్ నేత అయిన ధూళిపాళ్ల నరేంద్రను నిన్నటి నుంచి ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఆయన అక్రమాలకు పాల్పడ్డారు అంటూ, ఏసిబి అధికారులు ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఆయనను కస్టడీలోకి తీసుకున్న ఏసిబి క-రో-నా కాలంలో కూడా, విజయవాడకు తిప్పటంతో, ఆయన చివరకు క-రో-నా బారిన పడ్డారు. అయితే కోర్టు ఆదేశాలు ప్రకారం ఆయన్ను విజయవాడలోని ఆయుష్ హాస్పిటల్ లో చికిత్స ఇప్పించారు. నిన్న ఆయనకు నెగటివ్ వచ్చింది. అయితే ఆయనను నెగటివ్ అని తెలియగానే, ఆయన్ను వెంటనే రాజమండ్రి జైలుకు తరలించారు. అయితే ఈ వ్యవహారం పై, ధూళిపాళ్ల నరేంద్రకు చెందిన న్యాయవాదులు ఏసిబి కోర్టులో పిటీషన్ వేసారు. జ్యుడీషయిల్ కస్టడీలో ఉన్న ధూళిపాళ్ల నరేంద్రను, కోర్టు అనుమతి లేకుండా ఏసిబి అధికారులు, రాజమండ్రి జైలుకు తరలించటం పై కోర్టులో పిటీషన్ వేసారు. ఆయనకు నెగటివ్ వచ్చి గంటలు కూడా అవ్వలేదని, అయనను, ఇంకా ఏడు రోజులు పాటు, ఐసోలేషన్ లో ఉండాలని హాస్పిటల్ వర్గాలు చెప్పినా, వెంటనే ఆయన్ను రాజమండ్రి జైలుకు తీసుకుని వచ్చారని, ఒక పక్క కో-వి-డ్ వచ్చిన వాళ్ళు, ఎన్ని ఇబ్బందులు ఆరోగ్య పరంగా ఎదుర్కుంటున్నారో చూస్తున్నామని కోర్టుకు తెలిపారు.
అన్నీ తెలిసి కూడా ఇలా చేయటంపై, తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసారు. కోర్టుకి కూడా తమ వాదనలు గట్టిగా వినిపించారు. దీంతో ఏసిబి కోర్టు పోలీసులు తీరు పై తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు లేకుండా, ఎందుకు మళ్ళీ సెంట్రల్ జైలుకు తీసుకుని వచ్చారని ప్రశ్నించింది. హాస్పిటల్ కి తీసుకుని వచ్చేప్పుడు, కోర్టు అనుమతితో, కోర్టు ఆదేశాలు ప్రకారం, తీసుకుని వచ్చారని, ఇప్పుడు ఎవరి అనుమతి ఆయన్ను మళ్ళీ వెనక్కు తీసుకుని వెళ్ళారు అంటూ, తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది ఏసిబి కోర్టు. నెగటివ్ వచ్చినా ఆయనకు ఇంకా చికిత్స కొనసాగుతుందని, ధూళిపాళ్ల నరేంద్ర న్యాయవాదులు కోర్టుకి చెప్పిన నేపధ్యంలో, ఆయన్ను మళ్ళీ హాస్పిటల్ లో జాయిన్ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో మళ్ళీ రాజమండ్రి నుంచి, ఆయన్ను విజయవాడ అయుష్ హాస్పిటల్ కు తీసుకుని వచ్చారు. హాస్పిటల్ లో చికిత్స ముగిసిన తరువాత, ఏసిబి కోర్టు కు విషయం నివేదించి, కోర్టు అనుమతి తీసుకునే, ఆయన్ను మళ్ళీ రాజమండ్రి తీసుకుని వెళ్ళాలని ఆదేశాలు ఇచ్చింది.