ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది అంటూ హైకోర్టు ప్రశ్నించింది అంటే, పరిస్థతి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా రెండు రోజుల నుంచి, ఎంపీ రఘురామకృష్ణం రాజుని సిఐడి అరెస్ట్ చేసిన తీరు, అలాగే ఆయనను కస్టడీలో తీసుకున్న సమయంలో కొ-ట్టా-రు అనే ఆరోపణలు సంచలనం సృష్టించాయి. నిన్న సిఐడి కోర్టులో రఘురామకృష్ణం రాజుని హాజరు పరిచిన సమయంలో, అక్కడ ఉన్న జడ్జి గారికి, రఘురామరాజు ఫిర్యాదు చేసారు. తనను తాళ్ళతో కట్టేసి, ముసుగు వేసుకున్న అయుదుగురు వ్యక్తులు, తనను లాఠీలతో కొ-ట్టా-ర-ని ఫిర్యాదు చేసారు. రఘురామరాజు కాళ్ళకు తగిలిన గాయాలు కూడా జడ్జి పరీక్షించిన సంగతి తెలిసిందే. ఆయన ఫిర్యాదు మేరకు, తమకు రిపోర్ట్ ఇవ్వాలి అంటూ, సిఐడి కోర్టు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యులను ఆదేశించింది. అయితే ఇది పక్కన పెడితే, అసలు రఘురామకృష్ణం రాజు చేసిన ఆరోపణల పై, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, స్పందించారు. ఈయన ప్రభుత్వం తరుపున లాయర్ కావటంతో ఆయన మాటలు ప్రాధాన్యత సంతరించుకుంది. పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ, రఘురామరాజు తన చేష్టలతో కోర్టులను తప్పు దోవ పట్టిస్తున్నారు అంటూ, సంచలన ఆరోపణలు చేసారు.

rrr 16052021 2

రఘురామరాజు పిటీషన్ ను హైకోర్ట్ డిస్మిస్ చేసిందని, నిన్న మధ్యానం ఆయనకు భోజనం కూడా పెట్టారని, అప్పటి వరకు ఏ ఇబ్బంది లేకుండా మాములుగా ఉన్న రఘురామకృష్ణం రాజు, హైకోర్టులో పిటీషన్ డిస్మిస్ అయ్యిందని తెలిసిన తరువాత, డ్రామాలు ఆడుతున్నారు అంటూ వ్యాఖ్యలు చేసారు. పిటీషన్ కొట్టేసిన తరువాత, కట్టుకధ అల్లారని అన్నారు. ఎలాగు మెడికల్ రిపోర్ట్ వస్తుందని, అందులో నిజాలు తెలుస్తాయి అంటూ, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఆయన కాళ్ళ పై అలా కొ-ట్టి-న దెబ్బలు ఉంటే, అవి ఎందుకు వచ్చాయో చెప్పలేదు. లేకపోతే రఘురామారాజు కావాలని కొట్టుకున్నారా, నిజం చెప్పండి అంటూ రఘురామరాజు సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు. రఘురామరాజుని సాయంత్రం సిఐడి కోర్టుకు వచ్చే దాకా ఆయనతో, ఎవరినీ కలవనివ్వలేదని అన్నారు. సాయంత్రం 5 గంటలకు ఆయన న్యాయవాదులకు విషయం తెలిసిందని, అప్పుడే వెంటనే ఫోటోలు తీసి, కోర్టుకు సమర్పించామని అన్నారు. మెడికల్ రిపోర్ట్ లో వాస్తవాలు వస్తాయని, ఎలాంటి ఒత్తిడి లేకుండా రిపోర్ట్ ఇస్తారని నమ్ముతామని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read