ఒక పక్క క-రో-నా మహమ్మారి ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తూ, కనీసం వైద్యం అందక, బెడ్లు దొరక్క, ఆక్సిజన్ సమయానికి రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా క-రో-నా రోగుల కోసం అనేక కార్యకలాపాలు చేస్తూ, అధికారం లేకపోయినా, ప్రజలకు చేతనైన సాయం చేస్తుంది. బెడ్లు, ఆక్సిజన్, ప్లాస్మా, ఇంజక్షన్లు, మందులు, ఆర్ధిక సాయం, ఆహరం ఇలా ఏది వీలు అయితే, ప్రజలకు సహాయం చేస్తూ టిడిపి ముందుకు వెళ్తుంది. అయితే ఇప్పుడు టిడిపి అధినేత చంద్రబాబు, తన నియోజకవర్గం అయిన కుప్పంలో ఉన్న పరిస్థితి పై ఈ రోజు సమీక్ష చేసారు. కుప్పంలో ఉన్న వంద పడకల హాస్పిటల్ లో, ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం కోసం పూనుకున్నారు. ఇందు కోసం 35 లక్షలతో తన సొంత నిధులు ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్నారు. అలాగే వైద్య సిబ్బంది కొరత ఉందని తెలుసుకుని, వెంటనే ఎంత మంది కావాలో అంత మందిని నియమించాలని, వారి ఖర్చు కూడా తానే భరిస్తానని చెప్పారు. అలాగే ప్రస్తుతం అక్కడ ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ లో, ఆక్సిజన్ సరఫరా చేసే పరికరాలు కేవలం మొదటి అంతస్తులో ఉన్నాయని, ఆక్సిజన్ సరఫరా చేసే పరికరాలు, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే మరింత వెసులుబాటు ఉంటుందని చెప్పటం, ఆ పనులు కూడా చేయాలని చంద్రబాబు చెప్పారు.
అలాగే ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కుప్పం ప్రజలకు టెలి మెడిసిన్ తో పాటు, అవసరం అయిన వారిని జరుగుతున్న ఆహార పంపిణీని, మరింతగా విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. కుప్పం ప్రభుత్వ హాస్పిటల్ లో, 25 పల్స్ ఆక్సీమీటర్లు అవసరం అని చెప్పగా, రేపే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా హాస్పిటల్ కు పంపిస్తామని చంద్రబాబు అన్నారు. ఇక కుప్పం నియోజవర్గంలోని అన్ని మండలాల్లో ఎన్ని మందులు అవసరం అవుతాయో, అన్ని మందులు తానే పంపిస్తానని చెప్పారు. ఇక మరో పక్క ప్రభుత్వం డిగ్రీ కాలీజీలో 200 పడకలతో, ఓకేషనల్ జూనియర్ కాలేజిలో మరో 200 పడకలతో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, దీని పై కలెక్టర్ కు లేఖ రాస్తానని చంద్రబాబు తెలిపారు. ఈ మొత్తం ఖర్చు ఎంత అయితే అంత, తన సొంత ఖర్చులతో చేస్తామని, పనులను స్పీడ్ గా జరగాలని, ఎక్కడ అవసరం అనుకుంటే అక్కడ తనకు చెప్తే, తగిన చర్యలు తీసుకుంటానని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, స్థానిక నాయకులకు చెప్పారు.