నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు విషయంలో, గంట గంటకూ ట్విస్ట్ లు నడుస్తున్నాయి. నిన్నటి నుంచి ఈ కేసు విషయంలో అనేక ట్విస్ట్ లు నడుస్తున్నాయి. ఈ రోజు అందరూ మెడికల్ రిపోర్ట్ కోసం చూస్తూ ఉండగా, ఇప్పటికే కోర్టులు ఆయన్ను హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆదేశించగా, ఈ రోజు పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. రఘురామకృష్ణం రాజుని హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళకుండా, గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. గట్టిగా బందోభస్తు మధ్య, రఘురామరాజుని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. అయితే కోర్టు ఆదేశాలు ఇచ్చిందా, లేకపోతే పోలీసులే ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది ఇప్పటికే తెలియటం లేదు. నిన్న సిఐడి కోర్టు, ఆయనకు ఉన్న దెబ్బలు, ఆయనకు ఉన్న ఆరోగ్య సమస్యలు చూసి, ఆయన్ను హాస్పిటల్ కు తరలించాలని కోరారు. అయితే ఇప్పుడు పోలీసులు మాత్రం, అయాన్ను డైరెక్ట్ గా జైలుకు తీసుకుని వెళ్లారు. ఆయనకు తగిలిన దె-బ్బ-ల పై, మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలని కోర్టు కోరింది. అయితే ఈ రోజు నాలుగు గంటల వరకు ఆయన్ను గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉంచి, ఇప్పుడే జైలుకు తరలించారు.
రఘురామకృష్ణరాజు విషయంలో, ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు.. కోర్టు ఆదేశాలు ఉన్నాయా ?
Advertisements