మన తెలుగు వారి అందరికీ గర్వ కారణమైన రోజు. తెలుగు వాడు అనుకుంటే సాధించ లేనిది ఏమి లేదు అని చెప్పే మరొక ఉదాహరణ ఇది. భారత దేశ 48వ చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాగా, మన ఆంధ్రా వారైన జస్టిస్ నూతలపాటి వెంకట రమణ గారు, ఈ రోజు ప్రమాణస్వీకారం చేసారు. భారత రాష్ట్రపతి రాంనాద్ కోవింద్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి, ప్రధాని మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య సహా, అతి కొద్ది మంది మాత్రమే, హాజరు అయ్యారు. కో-వి-డ్ నిబంధనలు కారణంగా, అతి కొద్ది మందిని మాత్రం ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. మొత్తంగా, జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులతో పాటుగా, 50 మంది లోపు మాత్రమే ఆహ్వానించారు. భారత ప్రాధాన న్యాయమూర్తిగా, వచ్చే 16 నెలల పాటు ఆయన, చీఫ్ జస్టిస్ గా ఉండబోతున్నారు. అయితే జస్టిస్ ఎన్వీ రమణ ముందు అనేక సవాళ్ళు ఆయన ముందు ఉన్నాయని, న్యాయ నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా జస్టిస్ బాబ్డే చీఫ్ జస్టిస్ గా ఉన్న సమయంలో, అయుదు ఖాళీలు ఏర్పడినా కూడా, ఒక్క ఖాళీ కూడా పూరించలేదు. కోలీజీయం సిఫారుసు చేసినా, కేంద్ర ప్రభుత్వం అమలు చేయని పరిస్థితి ఉంది. ఈ ఏడాది మరో అయుదు ఖాళీలు కూడా రాబోతున్నాయి. మొత్తంగా పది ఖాళీలు రాబోతున్నాయి.
జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోనే కొలేజియం పై ఇప్పుడు ఈ బాధ్యత పడుతుంది. ఇప్పుడు ఈ కొలేజియం ఇచ్చే సిఫారుసులు కేంద్రం ఏ విధంగా అమలు చేస్తుంది అనేది చూడాలి. ఇవే కాక అనేక న్యాయ పరమైన నియామకాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇక మరో పక్క, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే కేసులు విషయంలో కూడా, చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇప్పటికే జస్టిస్ ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ గా నియామకం అవ్వకుండా చూడటానికి, ఆయన పై జగన్ మోహన్ రెడ్డి ఫిర్యాదులు చేయటం కలకలం రేపింది. అయితే అవన్నీ అప్పటి చీఫ్ జస్టిస్ బాబ్డే విచారణ చేసి, అవన్నీ నిరాధార ఆరోపణలుగా కొట్టేసారు. ఈ నేపధ్యంలోనే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి సుప్రీం కోర్టుకు వెళ్ళే అనేక కేసులు పాటి ఆసక్తి ఉంటుంది. ఇలా అనేక సమస్యలు ఆయనకు స్వాగతం పలుకుతున్నాయి. ఇక మరో పక్క క-రో-నా సమస్యలో, న్యాయ వ్యవస్థను ఎలా ముందకు తీసుకు వెళ్తారు. ఇక న్యాయ శాఖలో కొత్త సంస్కరణలు ఎలా తెసుకుని వస్తారో, ఇలా అనేకం, ఇప్పుడు ఆయన పని తీరుకు అద్దం పట్టనున్నాయి.