యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు, తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ, సిబిఐ కోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. మా ముఖ్యమంత్రి పై అనవసరపు ఆరోపణలు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, అందుకే ఏదో ఒకటి తేల్చేయాలి అంటూ, ఈ పిటీషన్ వేసినట్టు రఘురామరాజు తెలిపారు. అయితే, ఈ రోజు రాజధాని రాచ్చబండలో మాట్లాడిన రఘురామకృష్ణం రాజు, జగన్ బెయిల్ పిటీషన్ రద్దు పై మరి కొన్ని గంటల్లో తేలిపోతుందని అన్నారు. అయన మాట్లాడుతూ, జగన్ మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారు అని, అందుకే బెయిల్ రద్దు చేయాలి అంటూ, తాను దాఖలు చేసిన పిటీషన్ కొద్ది గంటల్లో విచారణకు రాబోతుందని అన్నారు. గురువారం మధ్యానం సమయంలో, దీని పై విచారణకు సిబిఐ కోర్టు చేపట్టే అవకాసం ఉందని అన్నారు. అయితే మొన్నటి దాకా ఫిసికల్ గా జరిగిన కోర్టు, ఇప్పుడు మారిన పరిస్థితిలో మళ్ళీ వర్చువల్ కోర్టులు నడుస్తున్నాయని అన్నారు. రేపు కోర్టు ఆదేశాలు బట్టి, వాళ్ళు ఏమి అడిగితే అది ఇవ్వటానికి, తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. విచారణ తరువాత, ఏమి జరిగిందో మొత్తం రేపు మళ్ళీ మీడియాకు చేప్తనాని రఘురామకృష్ణం రాజు అన్నారు.
మరికొన్ని గంటల్లోనే జగన్ బెయిల్ రద్దు పై విచారణ... నిర్ణయం పై సస్పెన్స్...
Advertisements