రాష్ట్రంలో క-రో-నా విలయతాండవంచేస్తోందని, రోజుకి 10వేలకు పైగా కేసులు, లెక్కకురాని మరణాలతో పరిస్థితి హృదయవిదారకంగా ఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం ఆయన తన నివాసం నుంచి విలేకరులతో మాట్లాడారు. "నాపై, నరేంద్రపై పెట్టిన తప్పుడు కేసులన్నీ న్యాయస్థానాల్లో వీగిపోతాయి. నాపై పెట్టిన కేసులతాలూకా నిన్ననే న్యాయస్థానం తీర్పుఇచ్చింది. ప్రభుత్వం పెట్టిన తప్పుడు కేసుపై, 29వతేదీన సీఐడీ ఎదుట హాజరై, ఆధారాలతో సహా తెలియచేస్తాను. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నాను... పదిరోజుల్లో వస్తానని చెప్పినా వినకుండా, తాను తప్పించుకున్నానని, దొరకడం లేదని సాయిరెడ్డితో విషపు ట్వీట్లు చేయించారు. రోజుకోనోటీసు ఇచ్చి, కావాలని నానావిధాలుగా దుష్ప్ర్రచారం చేశారు. నాపై ఇంత హాడావుడిగా తప్పుడుకేసులు పెట్టడానికి కారణం పోలవరంలో ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చేస్తున్న దోపిడీగురించి తాను నిత్యం ప్రశ్నించడమే. పోలవరంలో రూ.3222కోట్ల దోపిడీకి తెరలేపారు. ఒకే ఒక్కరోజులో రూ.2569కోట్లకు అంచనాలుపెంచారు. ఎవరి కోరకప్రకారం ప్రాజెక్ట్ అంచనావ్యయం పెంచారో చెప్పాలి. కాంట్రాక్ట్ పొందిన ఏజెన్సీకోసమా? పోలవరం హెడ్ వర్క్స్ డ్యామ్ పనులు అంచనాలు పెంచినప్పుడు ముఖ్యమంత్రిగానీ, మంత్రిగానీ మీడియాముందుకొచ్చి వివరణ ఇచ్చారా? పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా మార్చేశారు. పోలవరం డ్యామ్ హెడ్ రెగ్యులేటర్ దగ్గర రూ.912కోట్లతో ఒక ఎత్తిపోతల పథకం రూపొందించి, ఈ ముఖ్యమంత్రి గోదావరి డెల్టాను, కృష్ణా డెల్టాను ఉద్ధరిస్తాడా? పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్. 196 టీఎంసీలనిల్వసామర్థ్యంతో దాని నిర్మాణం జరగాలి. పోలవరం పవర్ ప్రాజెక్ట్ కొట్టేయాలన్న దుర్మార్గపుఆలోచనతోనే రాజశేఖర్ రెడ్డి హాయాంలో ఫోర్స్ ఫుల్ క్లోజర్ తో పనులు ఆపేయించారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దగ్గరదగ్గర 3వేలకోట్లవరకు నిర్మాణ వ్యయం పెరిగింది. నాలుగేళ్లసమయం వృథా అయ్యింది. తెలుగుదేశం ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చాక, డ్యామ్ సైట్ లోని నిర్వాసితులకు గతప్రభుత్వాలుచేసిన అన్యాయాన్ని సరిదిద్దింది."
"నిర్వాసితులకు మరలా డబ్బులిచ్చి, వారిని బతిమాలి...బామాలి.. ఇళ్లుకట్టించి ఖాళీచేయించడం జరిగింది. డ్యామ్ సైట్ ఖాళీ అయ్యాకే పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇప్పుడు పెంచిన అంచనా వ్యయం రూ.3222కోట్లు, ఇసుకపేరుతో పెంచిన రూ.569కోట్ల వ్యవహారంపై ఈ ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి. పోలవరం ప్రాజెక్ట్ ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా మార్చిన జగన్మోహన్ రెడ్డి కోట్లాది ప్రజల ఆశలను నీరుగార్చాడు. ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడుతున్నాడు. ధూళిపాళ్ల నరేంద్ర బయటకువస్తే, ప్రభుత్వ దుర్మార్గం బట్టబయలవుతుంది. సంగండెయిరీ, విజయడెయిరీ, విశాఖ డెయిరీ వంటివాటిని దెబ్బతీయడానికి, అమూల్ ను బాగుచేయడానికే ముఖ్యమంత్రి ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేయించాడు. అమరావతికోసం పోరాడుతున్న అనేకమంది రైతులు, మహిళలు నేడు క-రో-నా బారినపడి, చావుబతుకుల్లో కొట్టుమిట్టాడు తున్నారు. అమరావతిని ఆవిధంగా చంపేసిన ముఖ్యమంత్రి, తనదోపిడీకోసం పోలవరాన్ని ఈ విధంగా నాశనంచేస్తున్నాడు. ఈ ముఖ్యమంత్రి ఎన్ని తప్పుడుకేసులుపెట్టినా, ఎన్నిరకాలుగా వేధించినా, చంద్రబాబునాయుడిగారి నాయకత్వంలో వీరోచితంగా పోరాడుతూనే ఉంటాము. ముఖ్యమంత్రి పైశాచిక ఆనందంకోసమే ప్రశ్నించే గొంతులను నొక్కేస్తూ, ప్రశ్నించేవారిని అరెస్ట్ చేయిస్తున్నాడు. ముఖ్యమంత్రికి దమ్ము,ధైర్యముంటే క-రో-నా రోగులను పరామర్శించాలి. క-రో-నా-తో చనిపోయినవారి కుటుంబాలను ఆదుకోవాలి. రాష్ట్రంలో ఏదోఒక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి క-రో-నా రోగులతో మాట్లాడి, వారి సమస్యల పరిష్కారానికి చొరవచూపాలి. క-రో-నా వ్యాక్సిన్ కోసం వేలాదిమంది క్యూలైన్లలో నుంచున్నా పట్టించుకునేవారే లేరు. వాలంటీర్లు దొంగఓట్లు వేయిస్తుంటే, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు ముఖం చాటేసి తిరుగుతున్నారు. " అని ఉమా అన్నారు.