భారత దేశంలో క-రో-నా విలయతాండవం చేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విపరీతంగా కేసులు వస్తున్నాయి. రోజుకి పది వేల కేసులు వరుకు వస్తున్నాయి. వైరస్ వేగంగా, ఎప్పటి కంటే బాగా స్ప్రెడ్ అవుతుంది. ముఖ్యంగా పిల్లలు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. పాజిటివిటీ రేటు రాష్ట్రంలో 20 శాతం పైగా ఉంది. ముఖ్యంగా నెల్లూరు లాంటి జిల్లాలో, 40 శాతం పైన పాజిటివిటీ రేటు ఉంది. అయితే ఇవన్నీ చూస్తున్న వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, అనేక నియంత్రణలు ప్రజల మీద ఇంపోజ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే, ముఖ్యంగా పిల్లలు క-రో-నా బారిన విపరీతంగా పడటంతో, పదవ తరగతి పరీక్షలు రద్దు చేయటం, వాయిదా వేయటం చేసారు. అయితే, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం, యదావిధిగా పరీక్షలు ఉంటాయని చెప్తుంది. పదవ తరగతి, ఇంటర్ కలిపి, 15 లక్షల వరకు పిల్లలు ఉంటారు. వీరందరూ, పరీక్షలు రాయటనికి బయటకు వస్తే, ఈ సమయంలో ఎంత ముప్పో ప్రభుత్వానికి తెలియదా ? ఎందుకు జగన్ మోహన్ రెడ్డి ఈ విషయంలో ఇంత పట్టుదలగా ఉన్నారో అర్ధం కావటం లేదు. ఇప్పటికైనా మళ్ళీ సమీక్ష చేసి, పరీక్షలు రద్దు చేయక పొతే, ఇది అతి పెద్ద తప్పుగా మారక మానదు. ప్రభుత్వం అర్ధం చేసుకుంటుంది ఏమో చూద్దాం.
ఈ విషయంలో జగన్ కు ఎందుకు అంత పట్టుదల ? ఎందుకు అంత పెద్ద తప్పు చేస్తున్నారు ?
Advertisements