చంద్రబాబుని ఎలా అయినా అరెస్ట్ చేయాలనే తలంపుతో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, గత రెండేళ్ళ నుంచి చేయని ప్రయత్నం లేదు. అయితే చంద్రబాబు పై అవినీతి మారక , తమ మీడియా ద్వారా వేయగలుగుతున్నారు కానీ, ఆయన మీద అవినీతి మాత్రం నిరూపించలేకపొతున్నారు. అయితే అమరావతి విషయంలో అసైన్డ్ భూములు లాక్కున్నారు అంటూ, ఒక జీవో చూపించి, దాని పై చంద్రబాబు, నారాయణ పై కేసు పెట్టారు. ఇప్పుడు ఇదే జీవో పై, మాజీ ఎంపీ హర్షకుమార్, ఇలాంటి జీవోతోనే, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దళితుల భూములు లక్కుందని, ఇళ్ళ స్థలాల పేరుతో అరాచకం చేసారని, సిఐడికి ఫిర్యాదు చేసారు. చంద్రబాబుది తప్పు అయితే, జగన్ ది ఇంకా పెద్ద తప్పు అని, జగన్, బొత్స, ధర్మానలకు కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని అన్నారు. అమరావతి కోసం మేము స్వచ్చందంగా ఇచ్చామని రైతులు చెప్తున్నారని, ఇక్కడ అలా కాదని, వందలాది మంది దళితుల దగ్గర భూములు లాక్కున్నారని, అందుకే వీరి పై కేసులు పెట్టాలని,హ హర్ష కుమార్ సిఐడిని డిమాండ్ చేస్తూ, లేఖ రాసారు. మరి, సిఐడి ఏమి చేస్తుందో మరి ?
జగన్, బొత్స, ధర్మానలను ఫిక్స్ చేసిన హర్షకుమార్... వీరి పై కూడా కేసు పెడతారా ?
Advertisements