తిరుపతిలో అరాచకం తారా స్థాయిలో ఉంది. ఎక్కడ చూసినా దొంగ ఓటర్లు ఇష్టం వచ్చినట్టు స్వైరవిహారం చేస్తున్నారు. తమ ఓటు ముందే పోల్ అయిపోయిందని స్థానికులు ఆందోళన చేస్తున్నా సమాధానం చెప్పే వారు లేరు. పోలీసులు, అధికారులు చేతులు ఎత్తేసారు. ఇక తిరుపతి టిడిపి పార్లమెంట్ అభ్యర్ధి పనబాక లక్ష్మీ స్వయంగా రంగంలోకి దిగారు. దొంగ ఓట్ల పై, స్వయంగా రాతపూర్వకంగా, అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేసారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగటం లేదని ఫిర్యాదులో తెలిపారు. ఇంత రాజకీయ అనుభవం ఉన్న తమకు, ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని, ఇంత అడ్డ దిడ్డంగా ఎన్నికల నిర్వహణ ఎప్పుడు చూడలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే భయంతోనే, ఇలా రిగ్గింగ్ కు పాల్పడుతున్నారని వాపోయారు. చిత్తూరు జిల్లా నాలుగు వైపుల నుంచి, పెద్దిరెడ్డి దొంగల ముఠాని దింపి దొంగ ఓట్లు వేయిస్తున్నారని వాపోయారు. నకిలీ ఓటర్ కార్డులు ముద్రిస్తుంటే, పోలీసులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. జిల్లా ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించటం లేదని, ఎలక్షన్ కమిషన్ కు ఫోన్ చేసిన ఉపయోగం లేకుండా పోయిందని వాపోయారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read