తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి, జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు ఖరారు అయ్యింది. ఆ ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య పొత్తు ఖరారు కావటంతో, ఇరు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికీ దీనికి సంబంధించి, ఇరు పార్టీల ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఈ రోజు మరోసారి ప్రత్యెక సమావేశం అయిన నేతలు, భవిష్యత్తు ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి, ఎవరు ఎవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలి, ఇరు పార్టీల అభ్యర్ధులు, ఏ ఏ పార్టీకి ఎక్కడ బలం ఉంది అనే అంశం పై చర్చలు నడిచాయి. ఈ నేపధ్యంలో, మరోసారి భేటీ అయ్యి, అభ్యర్ధులని ఖరారు చేద్దామని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం జనసేన అధికారికంగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని రెండు రాష్ట్రాల్లో, ఇరు పార్టీలు కలిసి పాల్గుంటున్నాయి. హైదరాబాద్ ఎన్నికలకు సంబంధించి మాత్రమే, ఇద్దరూ వేరు వేరుగా పోటీ చేయాలని భావించటం, అప్పటి పరిస్థితితుల్లో జనసేన లిస్టు ప్రకటించిటం , తరువాత వెనక్కు తగ్గటం, పవన్ ని అవమానించారని జనసేన నేతలు అనటం, పవన్ బహిరంగంగా మాట్లాడటం, ఇవన్నీ చర్చకు దారి తీసాయి. అయితే ఇప్పుడు మాత్రం, ముందుగానే కూర్చుని మాట్లాడుకున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read