ఈప్రభుత్వం అడ్డగోలు, అరాచక, అప్రజాస్వామిక ప్రభుత్వమని, రాజ్యాంగమంటే ఏమాత్రం నమ్మకలేని ప్రభుత్వమని, చట్టాలన్నా, న్యాయశాస్త్రాలన్నా, ఏమాత్రం నమ్మకంలేని అవినీతిప్రభుత్వం అధికారంలో ఉండటం తెలుగువారి దురదృష్టమని టీడీపీ జాతీయప్రధానకార్యదర్శి మరియు పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య మండి పడ్డారు. శుక్రవారం ఆయనమంగళగిరిలోనిపార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే "రేపు తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. నిన్న సాయంత్రం ప్రచారానికి స్వస్తిపలికారు. ఇతరపార్టీల నా యకులను అక్కడినుంచి పోలీసులు పంపించేశారు. అధికారపార్టీవారు మాత్రం అక్కడే తిష్టవేసింది. రాష్ట్ర కేబినెట్ లోని మంత్రులంతా చిత్తూరు, నెల్లూరులోనే తిష్ట వేసిన విషయం డీజీపీకి తెలుసునా అని ప్రశ్నిస్తు న్నా. పిల్లి కళ్లుమూసుకొని పాలుతాగిన చందాన డీజీపీ కళ్లుమూసుకొని అంతా బాగుందని అనుకుంటున్నారు. రేపు ఎన్నిక ఉంటే, తిరుపతిలో అందరినీ పంపిచేస్తే, ఇంకా రాష్ట్రకేబినెట్ మొత్తం, ఆ రెండుజిల్లాల్లో గోతికాడ నక్కల్లా కూర్చొని ఉన్నారు. నిన్నటివరకు వీరంతా రాష్ట్రఎన్నికలకమిషన్ తో దోబూచూలాడుకున్నారు. స్టేట్ ఎన్నికలకమిషనర్ తో ఆటలాడి ఆయన్ని పంపిం చారు. ఇప్పుడు కేంద్ర ఎన్నికలకమిషనర్ తోకూడా అలానే దోబూచులాడుతున్నారు. రేపు ఎన్నికలుంటే, అక్కడ ఏంచేస్తున్నారు వీరంతా? మంత్రులకు అక్కడ ఏంపని? ఇప్పటికైనా మించిపోయింది లేదు, గౌరవ డైరె క్టర్ జనరల్, నెల్లూరు చిత్తూరు జిల్లాలోని మంత్రులను తరిమేయాలి. ఆయనకు ఆహక్కుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన కేంద్రఎన్నికలసంఘం పరిధిలో పనిచే స్తున్నారు. ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికో, జగన్మోహన్ రెడ్డికో భయపడాల్సిన పనిలేదు. ఎన్నికల కమిషన్ చెప్పందని చెప్పి మంత్రు లను తరమేయండి. మంత్రులకు అక్కడేంపని? ముఖ్యమంత్రి దీనిపై ఏంసమాధానం చెబుతారు? ఏం తందనాలు ఆడటానికి మంత్రులంతా అక్కడున్నారు? అవకాశం దొరికితే దుర్మార్గం చేయాలని, అవకాశం దొరి కితే దొంగఓట్లు వేయాలని, అవకాశం దొరికితే రిగ్గింగ్ చేయించొచ్చని, అవకాశం దొరికితే అప్రజాస్వామిక చర్య లకు పాల్పడవచ్చనే మంత్రులంతా అక్కడున్నారా?

ఎలాగైనా, ఏంచేసైనా సరే గురుమూర్తిని గెలిపించి, ము ఖ్యమంత్రి మెప్పు పొందాలన్నదే మంత్రులందరి లక్ష్యం. గోతికాడ నక్కల్లా ఎందుకుఉన్నారు వారంతా అక్కడ? ఒక అరాచకమంత్రి, బెట్టింగ్ మంత్రిని అక్కడ వదిలేస్తే వారు చూసుకుంటారుగా? కేబినెట్ మొత్తం అక్కడే ఉం డటంపై నేను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ని కలుస్తాను. ఓటర్లను ప్రభావితంచేయడానికి, ఏదోరకంగా దుర్మార్గా నికి పాల్పడటానికే మంత్రులంతా అక్కడున్నారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) విజయానంద్ ఒక లాఠీ తీసుకొని అవసరమైతే మంత్రులందరినీ అక్కడినుంచి తరిమేయాలని కోరుతున్నా. డీజీపీ తన డ్యూటీ తాను చేయడంలేదు కనుక, సీఈవో అయినా ఆపనిచేయాలి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలోని తిరుపతి పార్లమెం ట్ ఉపఎన్నిక జరుగుతుంటే, బయటిప్రాంతాలనుంచి బస్సుల్లో జనాలను తరలిస్తున్నారు. ఎందుకు అలా తర లిస్తున్నారని నేను అడుగుతున్నా. పీలేరు, పుంగనూ రు, మైదుకూరు, తదితర నియోజకవర్గాలనుంచి జనా లను ఎందుకు తరలిస్తున్నారో డీజీపీ సమాధానం చెప్పాలి. ఎందుకు తరలిస్తున్నారు..ఎక్కడికి తరలిస్తు న్నారో... గ్రహించి పోలీస్ శాఖ అప్రమత్తమవ్వాలని కోరుతున్నాను. పోలీసులు చెక్ పోస్ట్ లన్నీ ఏంచేస్తు న్నాయి? అంతమంది బస్సుల్లో వస్తుంటే, లాడ్జీలు, కళ్యాణమండపాలు తనిఖీ చేయాల్సిన పనిలేదా? పోలీ స్ వ్యవస్థ నిద్రాణంగా ఉందనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి? ఊరిచివర ఉన్న ఏసీ కళ్యాణమండ పాల్లో అంతమంది ఎందుకున్నారో తనిఖీ చేయాల్సిన బాధ్యత డీజీపీపై లేదా? ఈవిధంగా బయటినుంచి జనాల్ని తరలి స్తున్నారని, వారున్న ప్రాంతాలను తని ఖీ చేయాలని మేము ఎప్పుడో తెలియచేశాం. కానీ ఆ పనిచేయలేదు. చట్టం-నేరం చేయిచేయి కలిపి సాగు తున్నాయి. బయటినుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంతమందిని దించారో పోలీసుల కు తెలియదా? ఎన్నికలసంఘం ఏంచేస్తోంది.

ఎన్నికల పరిశీలకులను అప్రమత్తంచేయాలి. బయటినుంచి వచ్చిన జనంతో ఏంఅరాచకాలు చేయబోతున్నారు? బూత్ లు క్యాప్చర్ చేస్తారా? లేక రిగ్గింగు చేయిస్తారా? స్థానికఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తారా? టీడీపీ ఓటర్లు అధికంగా ఉండే గ్రామాలను భయాందోళనలకు గురిచేస్తారా? ఏంచేయబోతున్నారో తెలియాలి. ఎన్ని చేసినా, ఎన్నిచెప్పినా కూడా కిందిస్థాయిలో అవేమీ జర గడంలేదు? క్షేత్రస్థాయిలో ఏంజరుగుతుందో తెలియడా నికి ఎన్నికలకమిషనర్ ఒకకమిటీని వేయాలని కోరు తున్నాం. నిన్న మేంచెప్పాము... అంబులెన్సులు తని ఖీచేయమని...ఎన్నిచేశారో చెప్పమనండి? డీజీపీ ఈ ఎన్నికపై ఒక్క స్టేట్ మెంట్ కూడా ఎందుకివ్వలేదు? పారదర్శకంగా ఎన్నికలుజరపాలి.. ఎవరైనా తప్పుచేస్తే వెంటనే చర్యలుతీసుకోండనే మాట ఆయన ఎందుకనలే దు? ఆయన అలాఉన్నారంటే మీఇష్టమొచ్చినట్టు చేసు కోమనే కదా అర్థం. ఇదెక్కడి కేబినెట్.. ఇదెక్కడి ఎన్నిక ల నిర్వహణ? స్థానికఎన్నికల్లో చేసినట్టేచేసి, గెలవాల నా...లేక 5లక్షల మెజారిటీ తీసుకురాకపోతే ముఖ్యమంత్రి చెవులు పిండుతారని మంత్రుల భయ మా? అందుకోసమే మంత్రులంతా అక్కడున్నది. అం దుకోసమేనా వారంతా అవసరమైతే దౌర్జన్యాలు చేయ డానికి సిద్ధంగా ఉన్నది. లాడ్జీలు, కళ్యాణమండపా లు తనిఖీచేయండి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని క్లోజ్ గా అబ్జర్వ్ చేయాలి. ఆయనప్రతికదలికపై నిఘా పెట్టమని కోరుతున్నా. అంబులెన్సులు, సాక్షి ఓబీ వ్యాన్లనుకూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని తాము కోరు తున్నాము. తెలుగుదేశం నాయకులెవరూ అక్కడ లేరు. ఆ జిల్లాలు, ఆ నియోజకవర్గాల్లోనివారు తప్ప, బయటివారెవరూ లేరు. పాత్రికేయులుకూడా ఇటువంటి వాటి గురించిగట్టిగా రాయాలనికోరుతున్నా. స్లిప్పులు పంపిణీ కూడా వాలంటీర్లే చేస్తున్నారు. వాలంటీర్లు ఉద్యోగులు కారు, వారిని నియమించింది ప్రభుత్వ బాధ్యతలకోసం కాదు. వారంతా వైసీపీ ప్రచారకులు. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎన్నికలకమిషన్ ఇదంతా గమనించిందికానీ, పోలీసులు, రెవెన్యూ అధికారులు చేయాల్సినవిధంగా డ్యూటీ చేయడం లేదు. ఎన్నికల సంఘం ఆదేశాలను పోలీస్, రెవెన్యూ వ్యవస్థలు అమలు చేయకుంటే, ఈ అడ్డగోలు ప్రభుత్వం నుంచి రాష్ట్రాన్ని ఎవరుకాపాడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read