రాష్ట్రంలో నిత్యం రాజ్యాంగం అవమానాలకు గురవుతోందని, ప్రాథమిక హక్కులను ప్రభుత్వం హననం చేస్తోందని, జీవించే హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ప్రజలకు లేకుండా చేస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు స్పష్టంచేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ -19, ఆర్టికల్ -21 ద్వారా పౌరులకు జీవించే హక్కు, భావ ప్రకటన హక్కు సంక్రమించాయని, కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాటికి విరుద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. వైసీపీకి 51శాతం మంది ప్రజలు ఓట్లేశారని, ప్రతిపక్షాలకు ఓట్లేసిన మిగిలిన 49శాతం మందికి ఈ రాష్ట్రం లో జీవించేహక్కే లేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమన్నారు. రాజ్యహింస ఎలా ఉంటుందో ప్రభుత్వం చేసి చూపిస్తోందన్నారు. ప్రభుత్వంలోని వారు, అధికారపార్టీ నేతలు మాట్లాడితే, రాజ్య పరిరక్షణ కిందకు వస్తుందంటున్నారని, ప్రతిపక్షాలవారు, ప్రశ్నించేవారు, ప్రజలు మాట్లాడితే, రాజద్రోహం కింద పరిగణిస్తున్నారని ఆనందబాబు వాపోయారు. ఆఖరికి మీడియాకు, కోర్టులకు కూడా ప్రభుత్వం పసుపు రంగు వేసే దుస్థితికి దిగజారిందన్నారు. కొందరి కార్యక్రమాలను మీడియాలో చూపించడాన్ని తప్పుపడుతూ, ప్రభుత్వం కొన్నిఛానళ్లపై తప్పుడు కేసులు పెట్టిందన్నా రు. టీడీపీప్రభుత్వంలో సాక్షి మీడియాపై ఎన్ని రాజద్రోహం కేసులుపెట్టారో, ఇప్పుడు అధికారంలో ఉన్నవారు సమాధానం చెప్పాలని ఆనందబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండ మరీ పతాక స్థాయికి చేరిందన్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై స్పందించేవారిపై కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని, గుంటూరులో వరదలు వచ్చినప్పుడు తమనెవరూ పట్టించుకోలేదన్న వ్యక్తిపై, ఒకే అంశానికి సంబంధిచి పది పోలీస్ స్టేషన్లలో పదిరకాల కేసులుపెట్టడం జరిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవో ఒకటో, రెండోకేసులు పెడితే, కడుపు మండి మాట్లాడినవారిపై కేసులెలా పెడతావు చంద్రబాబూ అంటూ జగన్మో హన్ రెడ్డి హూంకరింపులకు దిగాడని ఆనందబాబు తెలిపా రు. ఆనాడు కడుపు మండినట్టే, ఇప్పుడు కూడా ప్రజలకు కడుపు మండే మాట్లాడుతున్నారనే వాస్తవాన్ని ముఖ్య మంత్రి ఎందుకు గ్రహించడంలేదన్నారు?

క-రో-నా కారణంగా ప్రజలు చనిపోతుంటే, చూసి తట్టుకోలేని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేరమెలా అవుతుందో ముఖ్యమంత్రే చెప్పాలన్నారు . గుంటూరు లో మహేశ్, కల్యాణ్ అనే ఇద్దరిని సోషల్ మీడియాలో ఏవో పోస్టులు పెట్టారంటూ అరెస్ట్ చేసి, అంతర్జాతీయ టెర్రరిస్ట్ ల మాదిరిగా పోలీసులు వారిని ముసుగులేసి మీడియా ముందుకు తీసుకొచ్చారని ఆనంద బాబు చెప్పారు. వారిపై సెక్షన్లు 294 (బీ), 500, 67(ఐటీ యాక్ట్) ల కింద కేసు నమోదు చేశారన్నారు. వారుచేసిన నేరమేమిటంటే విజయసాయిరెడ్డిపై ఏవో పోస్టులు పెట్టడమేనన్నారు. సుప్రీం కోర్టు ఏడేళ్లలోపు శిక్షలు పడే కేసుల్లో ఎవరినీ అరెస్ట్ చేయవద్దని, అకారణంగా కేసులుపెట్టి, వారిని జైళ్లకు పంపవద్దని స్పష్టంగా చెప్పినా కూడా ప్రభుత్వం కక్షసాధింపులకు దిగుతూనే ఉందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలనుకూడా ధిక్కరించి, అంతటి అత్యుత్సాహంతో పోలీస్ అధికారులు ఎవరికోసం పనిచేస్తున్నారో కాస్త ఆలోచించుకోవాలని మాజీ మంత్రి సూచించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు ఈవిధంగా ప్రవర్తించారా అని ఆనందబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లేదని ప్రజలకు అర్థమైందని, ఏబీఎన్, టీవీ5 సంస్థలపై కేసులుపెట్టడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమనే వాస్తవాన్ని ప్రతిఒక్కరూ గ్రహించాలన్నారు. గతంలో ఎక్కడైనాఒక విలేకరిపై, ఒక మీడియాసంస్థపై కేసులు పెడితే, అందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించేవారని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఎక్కడా కనిపించడంలేదన్నారు.

సాక్షి ఎప్పుడైతే పుట్టిందో, అప్పటినుంచే మీడియా కూడా వర్గాలు, కులాలవారీగా విచ్ఛిన్నమైందని ఆనందబాబు ఆవే దన వ్యక్తం చేశారు. మీడియా సంస్థలన్నీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయని ఇప్పుడు సంబరపడటం కాదని, భవి ష్యత్ లో ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో పాలకులు గ్రహిస్తే మంచిదన్నారు. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడుపడితే అప్పుడు టీడీపీ కార్యకర్తలను కొందరు అధికారులు హింసి స్తున్నారని, కావాలని వారిపై ఏదో కక్ష ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, అది ఎంత మాత్రం మంచిది కాదని టీడీపీనేత హితవుపలికారు. పగబట్టినట్టుగా పోలీసులు ప్రవర్తిస్తున్నారని, వారంతా ఏదో ఒక రోజు సమాధానం చెప్పి తీరాల్సిందేన న్నారు. భవిష్యత్, అధికారం ఎవరికీ శాశ్వతంకాదని, జగన్మోహన్ రెడ్డేమీ రాజు కాడని, ఇక్కడున్నది రాచరిక వ్యవస్థ కాదని ఆనందబాబు తేల్చిచెప్పారు. కొందరు పోలీసులు తమకు సంబంధంలేని విషయాల్లో కూడా అత్యుత్సాహం చూపుతున్నారన్నారు. రఘురామరాజు వ్యవహారంతో చంద్ర బాబునాయుడికి ఏం సంబంధముందని, ఆయన టీడీపీలో గట్టిగా రెండు వారాలు కూడా లేడన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపైనే చంద్రబాబునాయుడు ప్రశ్నిస్తున్నారు తప్ప, వ్యక్తులను దృష్టిలోపెట్టుకొని కాదన్నా రు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని, పాలకులు విచక్షణతో, వివేకంతో మసులకోవాలని ఆనందబాబు సూచించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read