ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బోర్డర్ లో మళ్ళీ రచ్చ మొదలైంది. దీని పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆగహ్రం వ్యక్తం చేసారు. ఆయన మాట్లాడుతూ "ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్యం కోసం హైదరాబాద్ వెళ్తున్న వాహనాలపై మళ్లీ తెలంగాణా సరిహద్దుల్లో అడ్డగిస్తున్నారు, ప్రతిసారీ ఈ పంచాయితీలు ఏమిటి? రాష్ట్రంలో ప్రజల బాగోగులు ముఖ్యమంత్రి జగన్ కు పట్టవా? రాష్ట్రప్రజల ఆవేదన చెవిటివాని ముందు శంఖంలా తయారైంది. దేశంలోని ఏ ఇతర రాష్ట్రాల్లోనూ ఇటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోవడం లేదు. వేలమంది హైవేలపై ఇబ్బంది పడుతున్నారు, తెలంగాణా అధికారులు అడ్డగిస్తుంటే ఆంధ్రప్రదేశ్ అధికారులు మాట్లాడరు. సాక్షాత్తు హైకోర్టు ఆదేశాలిచ్చినా పట్టించుకోవడం లేదు. పొందుగుల చెక్ పోస్టు వద్ద వాహనదారులపై తెలంగాణా పోలీసులు లా-ఠీ-చార్జి చేస్తున్నారు, అటువైపు రావద్దని బెదిరింపులకు దిగుతున్నారు. తెలంగాణా భారతదేశంలో అంతర్భాగం కాదా? అక్కడ ప్రత్యేక చట్టాలేమైనా అమలు చేస్తున్నారా? కనీసం మానవతా దృక్పథంతో కూడా వ్యవహరించడం లేదు. ప్రభుత్వాలకు ఒకవిధానం అంటూ లేకుండా పోతోంది. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి జగన్ కనీసం పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడే చొరవ చూపడం లేదు. వైద్యం కోసం వెళ్లే వారి ప్రాణాలతో ఇద్దరు సిఎంలు చెలగాటమాడుతున్నారు. అత్యవసరంగా వైద్యం కోసం వెళ్లే మంత్రినో, ఎమ్మెల్యేనో సరిహద్దుల్లో ఆపితే పరిస్థితి తీవ్రత ఏమిటో అర్థమవుతుంది. రాష్ట్రంలో గవర్నెన్స్ లేదు...గవర్నమెంటు ఉన్నట్లుగా కన్పించడంలేదు, కనీసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా సమస్యపై దృష్టిసారించాలి. తెలంగాణా అధికారులతో సమన్వయం చేసుకొని ప్రజలు ఇబ్బందిపడకుండా చూసేందుకు ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటుచేయాలి. ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోబోదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
"

Advertisements

Advertisements

Latest Articles

Most Read