ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం పై మరోసారి తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. జెడ్పీటీసి, ఎంపీటీసి ఎన్నికలు రద్దు చేస్తూ, ఉదయం హైకోర్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇదే విషయం పై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్న నీలం సాహనీ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిషత్ ఎన్నికల విషయం పై, హైకోర్టు తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుని తమకు కావలసినట్టు అనునయించుకుని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రవర్తించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తీర్పుని కనీసం అవగాహన కూడా చేసుకోలేరా అంటూ, ఆగ్రహం వ్యక్తం చేసింది. తీర్పుని అర్ధం చేసుకోవటం లో విఫలం అయ్యారు అంటూ తీవ్ర ఆగహ్రం వ్యక్తం చేసింది. మీ ఇష్టం వచ్చినట్టు సుప్రీం తీర్పుని అన్వయించుకోవడం ఏ మాత్రం ఆమోదం కాదు అంటూ, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పై ఆగ్రహం వ్యక్తం సెహ్సింది. నోటిఫికేషన్ తరువాత నాలుగు వారల సమయం ఉండాలని స్పష్టంగా చెప్పారని, ఇంగ్లీష్ తెలిసిన సామాన్యుడు ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్ధం అవుతుందని, అలాంటిది ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా ఉన్న వ్యక్తి చీఫ్ సెక్రటరీగా కూడా పని చేసారు కదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి, సుప్రీం ఇచ్చిన తీర్పు అర్ధం చేసుకోలేకపోవటం ఆశ్చర్యాన్ని కలిగించిందని పెర్కౌంది.

sahani 21052021 1

ఇలాంటి విషయాలు కూడా అర్ధం చేసుకోలేని వారు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా వారి అర్హత పై కడు ఆలోచించుకోవాల్సి వస్తుందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతులు స్వీకరించిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేసారని, హైకోర్టు ఆగహ్రం వ్యక్తం చేసింది. ఉదయం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రద్దు చేసిన హైకోర్టు, కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి అంటూ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలకు అనుకూలంగా నోటిఫికేషన్ ఇవ్వలేదని హైకోర్టు పేర్కొంది. పోలింగ్ జరిగే నాలుగు వారల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని పేర్కొంది. అయితే దీని పై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికే ఎన్నికలు జరిపెసమని, లాగే కౌంటింగ్ చేయాల్సి ఉందని, ఈ తరుణంలో ఎన్నికల రద్దు చేయాలి అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు పై, అపీల్ కు వెళ్తామని ప్రభుత్వం అంటుంది. ఈ రోజు ఇదే విషయం పై మాట్లాడిన సజ్జల కూడా, అసంతృప్తి వ్యక్తం చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read