వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు బెయిల్ పిటీషన్ పై ఈ రోజు సుప్రీం కోర్టులో వదనలు జరిగాయి. ఈ వాదనలు దాదాపుగా రెండున్నర గంటలు కొనసాగాయి. రెండు వైపులా చాలా వాడీ వేడిగా, హోరా హోరీగా వాదనలు జరిగాయి. ఒక కేసు ఇంత సుదీర్ఘంగా వాదనలు జరగటం చాలా అరుదుగా జరుగుతుంది. రెండు వైపుల వాదనలు విన్న కోర్టు, అయుదు నిమిషాలు పాటు బ్రేక్ తీసుకుంది. తరువాత తమ ఆర్డర్స్ ఇస్తూ, రఘురామరాజుకి బెయిల్ మంజూరు చేసింది. ఆయనకు తగిలిన గా-యా-లు, ఆయనకు హార్ట్ సర్జరీ అవ్వటం, ఇలా అన్ని ఆధారంగా తీసుకుని బెయిల్ ఇచ్చింది. ఆయనకు సొంత పూచికట్టు పై, అలాగే ఇద్దరు జామీ దారులుతో కలిసి లక్ష రూపాయలు షూరిటీ బాండ్లు సమర్పించి, బెయిల్ తీసుకోవచ్చని సుప్రీం కోర్టు తెలిపింది. గుంటూరులో ఉన్న సిఐడి కోర్టులో వీటిని దాఖలు చేసి, బెయిల్ తీసుకోవచ్చని చెప్పింది. ఇక అలాగే రఘురామరాజుకు కొన్ని షరతులు కూడా విధించింది. రఘురామరాజు ఈ కేసుకు సంబంధించి మీడియా లో కానీ, సోషల్ మీడియాలో కానీ మాట్లాడకూడదని చెప్పింది. అలాగే దర్యాప్తు అధికారికి సహకరించాలని, ఆయన్ను దర్యాప్తుకి పిలవాలి అంటే, 24 గంటలు టైం ఇచ్చి, లాయర్ సమక్షంలో దర్యాప్తు చేయాలని ఆదేశించింది.
అలాగే రఘురామరాజు ఆయనకు తగిలిన దెబ్బలను మీడియాకు చూపించకూడదని ఆదేశాలు ఇచ్చింది. రఘురామరాజు పై మోపిన అభియోగాలు, ఆయన్ను కస్టడీలోకి తీసుకోవాల్సిన అభియోగాలు ఏమి ఆయన పై లేవని అంది. అలాగే రఘురామరాజుని పోలీస్ కస్టడీలో కొట్టారు అని ప్రాధమిక సమాచారం ఉందని, ఆర్డర్ లో పెట్టాలని న్యాయవాదులు కోరగా, కోర్టు అంగీకరించింది. మొత్తంగా రఘురామరాజు విషయంలో జగన్ మోహన్ రెడ్డి పర్సనల్ గా తీసుకున్నా, కోర్టు, చట్టం, న్యాయం అన్నీ పరిశీలించి, ఆదేశాలు ఇచ్చింది. ఇక ఫైనల్ ఆర్డర్ కాపీలో ఎలాంటి అంశాలు కోర్టు ప్రస్తావిస్తుందో చూడాల్సి ఉంది. అయితే ఇదే సందర్భంలో, ఒక మీడియా వర్గం, రఘురామరాజు మీడియాతో అసలు మాట్లాడకూడదు అని ఆదేశాలు అంటూ చెప్తున్నారు, అయితే కోర్టు ఈ కేసుకి సంబంధించి మాత్రమే, మాట్లాడకూడదని చెప్పింది. ఏ కోర్టు అయినా, ఎవరైనా ఒక పౌరుడి ప్రాధమిక హక్కు అయిన ఫ్రీడమ్ అఫ్ స్పీచ్ ని నిలువరించదు, కేవలం ఈ కేసు విషయం మాత్రమే మాట్లాడవద్దని అన్నది.