రఘురామకృష్ణం రాజు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీలో పలు కేంద్ర మంత్రులను కలుస్తున్న రఘురామరాజు కుటుంబ సభ్యులు, కీలక నిర్ణయం తీసుకున్నారు. రఘురామరాజు కుమారుడు భరత్, సుప్రీం కోర్టులో మరో పిటీషన్ దాఖలు చేసారు. సిఐడి కస్టడీలో ఉన్న తన తండ్రి పై, సిఐడి అధికారులు కొ-ట్ట-టం పై, సుప్రీం కోర్ట్ పర్యవేక్షణలో దర్యాప్తు నిర్వహించాలని, దర్యాప్తుని సిబిఐ లేదా, సుప్రీం కోర్టు నిర్నయంచే ప్రత్యెక బృందంతో, ఈ దర్యాప్తు జరపించాలని, భరత్ తన పిటీషన్ లో పేర్కొన్నారు. అయితే ఇందులో, ప్రతి వాదులుగా, జగన్ మోహన్ రెడ్డిని, సిఐడి అధికారులను కూడా ఇందులో చేర్చారు. ఈ దర్యాప్తులో దోషులుగా తేలితే, వారి అందరి పై కూడా, కేసులు నమోదు చేసేలా ఆదేశించాలని కూడా ఈ పిటీషన్లో పేర్కొన్నారు. వినీత్ శరణ్, బీఆర్ గగాయ్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు ఈ పిటీషన్ విచారణకు రాబోతుంది. రేపు ఈ పిటీషన్ విచారణకు వచ్చే అవకాసం ఉంది. అయితే ఈ పిటీషన్ ను ఒక కీలక పిటీషన్ గా విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పిటీషన్ తో, ఈ కేసు మరో మలుపు తిరుగుతుందని భావిస్తున్నారు. ఈ కేసు సిబిఐకి వెళ్తుందా అనేది కూడా చూడాల్సి ఉంది. ఆయనను కొ-ట్ట-టం నిజమే అయితే, ఆర్మీ హాస్పిటల్ లో ఇచ్చే మెడికల్ నివేదిక కూడా ఇప్పుడు కీలకం కాబోతుంది.

rrr 20052021 2

ఆర్మీ హాస్పిటల్ కనుక, గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చిన రిపోర్ట్ కు భిన్నంగా ఇస్తే, కొ-ట్ట-టం వల్లే అని రిపోర్ట్ ఇస్తే, సిబిఐ రంగ ప్రవేశం చేసే అవకాసం ఉంది. ఈ రోజు రఘురామకృష్ణం రాజు కుమారుడు దాఖలు చేసిన పిటీషన్, రేపు బెయిల్ పిటీషన్, అలాగే మెడికల్ రిపోర్ట్, ఈ మొత్తం అంశాలు ఇప్పుడు ఏ టర్న్ తీసుకుంటుందో చూడాల్సి ఉంది. అయితే ఈ పిటీషన్ వేసిన సందర్భం, ఇవన్నీ చూసిన విశ్లేషకులు, ఢిల్లీలో పెద్దలు ఇచ్చిన సూచన మేరకే, ఈ కేసు వేసారా అనే చర్చ కూడా నడుస్తుంది. ఎందుకంటే, రెండు రోజులుగా రఘురామరాజు కుటుంబ సభ్యులు ఢిల్లీలో ఉన్నారు. హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజనాద్ సింగ్, పార్లమెంట్ స్పీకర్ ని కలిసి, రఘురామరాజు అరెస్ట్, తదినంతర పరిణామాలు వివరించారు. వాళ్ళు ఎలాంటి హామీ ఇచ్చారో బయటకు రాలేదు కానీ, ఈ రోజు సుప్రీం కోర్టులో రఘురామ రాజు కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటీషన్ వెనుక మాత్రం, ఢిల్లీ పెద్దలు ఎవరైనా ఉన్నారా అనే చర్చ జరుగుతుంది. చూడాలి మరీ, ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో.

Advertisements

Advertisements

Latest Articles

Most Read