ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రఘురామకృష్ణం రాజు పై, ఏపి ప్రభుత్వం పెట్టిన కేసు, అనేక మలుపులు తిరుగుతూ, చివరకు అసలు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితికి చేరుకుంది. మొదట్లో రఘురామరాజుని అరెస్ట్ చేసామని హడవిడి చేసిన వైసీపీ నేతలు, మొదట్లో తమదే పై చేయి అని హడావిడి చేసారు. మా జోలికి వస్తే, ఎవరినైనా ఇలాగే చేస్తాం అనే విధంగా, సంకేతాలు ఇచ్చారు. విమర్శలు కూడా తట్టుకోలేకుండా, ఈ మధ్య ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్న తీరు వివాదాస్పదం అవుతుంది. రఘురామరాజు ఒక ఎంపీ. ఆయనను సిఐడి కస్టడీలోకి తీసుకున్న తీరు, తరువాత ఆయన పై దా-డి చేసారనే వార్తా బయటకు రావటం, గా-యా-లు నిజమే అని ఆర్మీ హాస్పిటల్ చెప్పటం, చివరకు సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వటం ఇవన్నీ జరిగిపోయాయి. ఇదే క్రమంలో, రఘురామరాజు ప్రెస్ కాన్ఫరెన్స్ ని, ఏబిఎన్, టీవీ5 ప్రచారం చేస్తున్నాయి అంటూ, చివరకు వారి పై కూడా రాజద్రోహం కేసు పెట్టారు. ఇప్పటికే ఏబిఎన్, టీవీ5, ఈ రాజద్రోహం కేసు పై, సుప్రీం కోర్టుకు వెళ్ళాయి కూడా. ఈ కేసు త్వరలోనే సుప్రీం కోర్టులో విచారణకు వచ్చే అవకాసం ఉంది. ఇది ఇలా ఉంటే, ఏబిఎన్ ఛానల్ ని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం టార్గెట్ చేయటం పై, ఏబియెన్ ఎండీ రాధాకృష్ణ కూడా, అదే స్థాయిలో స్పందిస్తూ, జగన్ ప్రభుత్వానికి చాలెంజ్ విసిరారు.

rk 23052021 2

రఘురామరాజు కేసులో, సిఐడి కోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రకారం, ఆయనకు తగిలిన గా-యా-ల పై గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో చూసి, ఒక రిపోర్ట్ తయారు చేయమని చెప్పారు. అయితే గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ రిపోర్ట్ లో, ఎక్కడా రఘురామరాజు గా-యా-లు అయినట్టు చెప్పలేదు. వాళ్ళ పై అనేక ఒత్తిడులు ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఇది ఇలా ఉంటే, ఇదే విషయం పై ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో పాటు, ఆర్కే, జగన్ ప్రభుత్వానికి చాలెంజ్ చేసారు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యుల పై ఒత్తిడి తెచ్చి, మీకు ఇష్టమైన రిపోర్ట్ తెప్పించుకున్నారని, నిజాన్ని దాచేసరని, తప్పుడు రిపోర్ట్ పై, తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని, అవి నిజం కాకపొతే, తమ పైన కేసు పెట్టుకోవచ్చు అంటూ, ఆంధ్రజ్యోతితో పాటుగా, ఆర్కే కూడా ప్రభుత్వానికి చాలెంజ్ చేసారు. కేవలం తమ ఛానల్ లో, రఘురామరాజు వీడియోలు వేసినందుకే, రాజద్రోహం కేసు పెడితే, మరి ఇప్పుడు ఇంత పెద్ద ఆరోపణ చేసిన ఆంధ్రజ్యోతి పై, జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా ? ఆధారాలు చూపిస్తాం అంటున్నారు, చూపించండి అని వైసీపీ నేతలు ప్రెస్ ముందుకు వచ్చి అడగగలరా ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read