జగన్మోహన్ రెడ్డి తన మోసకారీ సంక్షేమంతో ప్రజలకు ఇచ్చేది గోరంత, దోచేది కొండంతగా మారిందని, తన రెండేళ్ల పాలనలో ఊహించినట్టుగానే కాకుండా, ఎవరూ ఊహించని విధంగా కూడా బ్రహ్మండంగా తన దోపిడీ కొనసాగించాడని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే యథాతథంగా... "పోలవరం నిర్వాసితులు తమకురావాల్సిన పరిహారం కోసం పెద్దఎత్తున కొన్నిరోజుల నుంచి ఉద్యమిస్తున్నారు. నిర్వాసితులకు చెందాల్సిన సొమ్ముని దిగమింగుతున్నారు. టీడీపీ ఆధారాలు లేకుండా ఏదీమాట్లాడదని ప్రజలుకూడా గుర్తుంచుకోవాలి. 13-07-2020న మచ్చామహాలక్షి అనే ఆమెకు సంబంధించి రూ.కోటి16లక్షల86వేలను పరిహారం కింద కేటాయిస్తున్న ట్లు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఆమె బ్యాంక్ (హెచ్ డీఎఫ్ సీ) ఖాతా నెం- 50100356429450. ఆశ్చర్యకరంగా ఏరోజైతే ప్రొసీడింగ్స్ ఇచ్చారో, అదేరోజున మచ్చా మహాలక్ష్మి పేరుతో బ్యాంక్ ఖాతా కూడా ప్రారంభించారు. ఖాతా ప్రారంభించి మహాలక్ష్మీ ప్రమేయం లేకుండానే రూ.కోటి16లక్షల86వేల సొమ్ముని ఆమె పేరుతో ఉన్న ఖాతాకు బదలాయించారు. సర్వేనెం-78లో 11ఎకరాల భూమి ఆమె పేరుతో ఉందని చెప్పారు. ఫామ్ -9 ప్రకారం సర్వేనెం-78లో 17.23 ఎకరాలభూమి (అన్ క్లెయిమ్డ్ ల్యాండ్) ఎవరి పేరుతో లేనట్లుగా ఉంది. ఆ భూమిలో 11ఎకరాలను మచ్చామహాలక్ష్మీ పేరుతో ఉన్నట్లుగా చూపించి, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకులో ఖాతా తెరిచి, రూ.కోటి16లక్షల86వేల సొమ్ముని ట్రాన్స్ ఫర్ చేశారు. అడంగల్, పహాణీ ప్రకారం అసలు మచ్చా మహాలక్ష్మీపేరుతో ఉన్నది కేవలం ఎకరా భూమి మాత్రమే. ఇదే విధంగా మదకంసావిత్రి అనే ఆమె పేరుతో కూడా 13-07-2020నే రూ.99లక్షల07వేల135 లు పరిహారం సొమ్ముకింద కేటాయిస్తున్నట్లు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. తిరిగి అదేరోజున హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ భద్రాచలం శాఖలో ఖాతానెం-50100356429476 ప్రారంభించి, పరిహారం సొమ్ముని దానిలోకి బదలాయించారు. ఫామ్ -9 ప్రకారం సర్వేనెంబర్ 30లో 4.08ఎకరాలు, సర్వేనెం-45లో 4.29 ఎకరాలు, సర్వేనెంబర్ 77లో 0.16 ఎకరాలను కలిపి, మొత్తంగా 9 ఎకరాలను సావిత్రి పేరుతో రాసేసి, రూ.99లక్షలు ఆమె పేరుతో ఉన్న బ్యాంక్ ఖాతాకి బదలాయించారు.

pattabhi 07062021 2

ఫామ్ -9లో ఎక్కడా సావిత్రి పేరులేదు. ఆ సర్వే నంబర్లలో ఉన్న భూమంతా (అన్ క్లెయిమ్డ్ ల్యాండే) ఎవరిదీ కానిదే. ఎవరిదీ కాని భూమికి (అన్ క్లెయిమ్డ్ ల్యాండ్ కి) ఆర్ అండ్ ఆర్ కింద పరిహారం ఇవ్వాలంటే తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్స్ అవసరం. లేకపోతే కనీసం కోర్టు ప్రోసీడింగ్స్ అయినా ఉండాలి. కానీ వైసీపీ ఎమ్మెల్యే బాలరాజు స్థానికంగా పీవోగా ఉన్నవ్యక్తితో కలిసి ఈరకంగా తప్పుడు బ్యాంకు ఖాతాలు సృష్టించి కాజేయడానికి పథకం వేశారు, మహాలక్ష్మీ, సావిత్రిల పేరుతో సృష్టించిన రెండు బ్యాంక్ అకౌంట్లకే దాదాపుగా రూ.2కోట్ల15లక్షల సొమ్ము బదిలీ అయింది. డిసెంబర్ 14,-2020న మహాలక్ష్మీ పేరుతో ఉన్న బ్యాంక్ ఖాతాకి రూ.కోటి16లక్షలకుపైగా సొమ్ము తరలించబడింది. అలాడిపాజిట్ అయిన సొమ్ముని డిసెంబర్ 21-2020న రూ.30లక్షలు, డిసెంబర్ 22న రూ.40లక్షలు, డిసెంబర్ 23న రూ.10లక్షలసొమ్ముని ఇతరఖాతాల్లోకి మళ్లించారనే సమాచారముంది. మదకం సావిత్రి ఖాతాలోకికూడా అదే డిసెంబర్14-2020న రూ.99లక్షల07వేలను జమ చేయడం జరిగింది. అలా జమయిన దానిలో డిసెంబర్ 28న రూ.30లక్షలు, డిసెంబర్31న రూ.29లక్షలు, జనవరి 01- 2021న రూ.40లక్షలు మొత్తం 99లక్షలను ఇతర ఖాతాల్లోకి మళ్లించారు. మదకం సావిత్రి, మచ్చా మహాలక్ష్మీలను అడ్డుపెట్టుకొని, వారిపేర్లతో వారికే తెలియకుండా బ్యాంకు ఖాతాలుతెరిచి సొమ్ము దిగమింగారు. వారికి ఆర్ అండ్ ఆర్ పరిహారం ఇస్తున్నట్టుగా తప్పుడు రికార్డులు సృష్టించారు. ఆ విధంగా స్థానిక వైసీపీఎమ్మెల్యే బాలరాజు, పీవో సూర్య నారాయణ అనేవ్యక్తి కుమ్మక్కై ఆర్ అండ్ ఆర్ నిధులను నిర్వాసితుల పేరుతో బొక్కేశారు. " అని పట్టాభి అన్నారు. అయితే ఈ ఆరోపణలను స్థానిక ఎమ్మెల్యే ఖండించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read