జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన సోమవారం ఉంటుందని అందరూ భావించారు. మీడియా కూడా ఈ విషయం పై రెండు రోజుల నుంచి కధనాలు ప్రకటించింది. అయితే ఇప్పుడు ఆయన పర్యటన వాయిదా పడిందని, గురువారం ఆయన పర్యటన ఉంటుందని సమాచారం వచ్చింది. అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆఫీస్ వర్గాలు, జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వచ్చిన తరువాత అప్పాయింట్మెంట్ ఇస్తామని చెప్పారు. అయితే ఢిల్లీ వెళ్ళిన తరువాత ఒకవేళ అప్పాయింట్మెంట్ లభించక పొతే,మళ్ళీ ఇబ్బందులు ఉంటాయని, ఆయన పర్యటన వాయిదా వేసుకున్నట్టు తెలిసింది. దీంతో పాటు, కేంద్ర రక్షణ మంత్రి రాజనాద్ సింగ్, అదే విధంగా జలశక్తి శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షకావత్, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతరామన్, న్యాయ శాఖా మంత్రి అప్పాయింట్మెంట్ కూడా కోరారు. అయితే ఒక్క అమిత్ షా వద్ద నుంచే, అది కూడా రేపు ఢిల్లీ వస్తే అప్పుడు అప్పాయింట్మెంట్ ఖరారు చేస్తామని చెప్పటం, అలాగే జలశక్తి శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ అప్పాయింట్మెంట్ టైం క్లారిటీ రాకపోవటం, మిగతా ముగ్గిరు మంత్రులు కూడా, అప్పాయింట్మెంట్ కు సంబంధించి క్లారిటీ ఇవ్వలేదు, ఈ నేపధ్యంలోనే పూర్తిగా అప్పాయింట్మెంట్ లు ఖరారు అయిన తరువాతే ఢిల్లీ వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు.

amitshah 06062021 2

ఇందు కోసమే జగన్ మోహన్ రెడ్డి పర్యటన వాయిదా వేసుకుని, గురువారం అప్పాయింట్మెంట్ ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. గురువారం అప్పాయింట్మెంట్లు లభిస్తే, ఆ రోజు ఆయన ఢిల్లీ వెళ్ళే అవకాసం ఉంది. ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వరుస వివాదాలు చుట్టుముట్టటం, అలాగే దేశ వ్యాప్తంగా పరువు పోతూ ఉండటంతో, జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంచరించుకుంది. అయితే ఢిల్లీ పర్యటన కేవలం వ్యాక్సిన్లు, పోలవరం కోసం, విభజన హామీల కోసం అని చెప్తున్నా, ప్రధాన్యతాంసాలు వేరే ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యవహారంతో, దేశ వ్యాప్తం పరువు పోతుంది. అలాగే కేంద్రం కూడా ఈ విషయంలో, సీరియస్ గా ఉందనే సమాచారం వస్తుంది. ఇక రఘురామకృష్ణం రాజు వేసిన జగన్ బెయిల్ రద్దు పిటీషన్ కూడా, 14వ తేదీన విచారణకు వస్తుంది. అలాగే టీవీల పై పెట్టిన రాజద్రోహం కేసు పై, సుప్రీం కోర్ట్ చేసిన వ్యాఖ్యల పై కూడా, ఆయన కేంద్రానికి వివరణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మొత్తం మీద, ఇప్పుడు సీన్ సోమవారం నుంచి ఢిల్లీకి మారింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read