ఆంధ్రప్రదేశ్ తెలంగాణా మధ్య లేని వివాదాలు, లేని ఉద్రిక్తత కావాలని చేసే ప్రయత్నం, గత కొన్నాళ్లుగా జరుగుతూనే ఉంది. మొన్నటి వరకు భోజనాలు పెట్టుకుని, స్వీట్లు తినిపించుకుని, వాటేసుకుని, మీ రాష్ట్రాన్ని నేను బాగు చేస్తా అని, మీ రాష్ట్రాన్ని నేను కూడా బాగు చేస్తానని, ఇరువురు ముఖ్యమంత్రులు రాసుకుని పూసుకుని తిరిగారు. ఆయన అడగిందే ఆలస్యం, క్యాబినెట్ నిర్ణయం కూడా లేకుండా, ఈయన సచివాలయం భావనలు ఇచ్చేసి వచ్చాడు. ఇక కరెంటు బకాయలు, షడ్యుల్ 9, 10 ఆస్తులు విభజన, ఇలా అనేకం ఇంకా పెండింగ్ లో ఉన్నా, ఇరువురు నోరు ఎత్తరు. ఇంత స్నేహంగా ఉండే వాళ్ళు, ఎందుకో మరి, ఏ కారణమో తెలియదు, అసలు లేని సమస్యను సృష్టించి, నీళ్ళు తోడుకుపోతున్నారని మొదలు పెట్టి, చివరకు విద్యుత్ ఉత్పత్తి వరకు చేస్తూనే ఉన్నారు. దీని వాళ్ళ ఏపి రాష్ట్రానికే నష్టం. అయినా కేవలం లేఖలతో సరిపెడుతున్నారు. అయితే ఇప్పుడు మరో వివాదం ఏపి తెలంగాణా మధ్య నెలకొంది. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామీకి కూడా రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నారు. అందరి వాడైన దేవుడిని కూడా ఇందులోకి లాగుతున్నారు. తెలంగాణ నుంచి ప్రజా ప్రతినిధులు సిఫారుసు లేఖలు పంపిస్తుంటే, టిటిడి అధికారులు దాన్ని తిరస్కరిస్తున్నారు అంటూ, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు.

tirumala 12072021 2

టిటిడి ఈవో, తమ సిఫారుసు లేఖలను పరిగణలోకి తీసుకోవద్దు అని చెప్పారని, ఆయన ఆరోపించారు. నీటి తగాదా నడుస్తున్న టైంలో, ఇలా చేయటం మంచి పద్దతి కాదని, ఇవి రాను రాను పెద్దవి అవుతాయని అంటున్నారు. పెను తుఫానుగా ఈ సమస్యలు మారతాయని అన్నారు. ఇరువు ముఖ్యమంత్రులు దీని పై చర్చించాలని అన్నారు. అయితే ఆయన ఆరోపణలను టిటిడి తిప్పి కొట్టింది. ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని, ఎప్పటి లాగానే తెలంగాణా ప్రజాప్రతినిధుల సిఫారుసు లేఖలకు దర్శనం కల్పిస్తున్నామని టిటిడి చెప్పింది. ఒకే వ్యక్తి నుంచి ఎక్కువ సిఫార్సులు వస్తే, విఐపి బ్రేక్ దర్శనం సమయం సరిపోదు కాబట్టి, వాటిని తిరస్కరిస్తున్నాం అని, అయినా కూడా అలంటి వారికి 300 రూపాయల దర్శనం కలిపిస్తున్నామని, వాళ్ళు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. అయితే దేవుడిని కూడా ఇలా రాజకీయాలకు వాడుకోవటం పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైనా ఉంటే చర్చించుకోవాలి కాని, ఇలా రచ్చకెక్కటం కరెక్ట్ కాదని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read