ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి భారీ షాక్ వచ్చింది. భారీ షాక్ అనటానికి కారణం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చులతో పోల్చుకుంటే, ఆదాయం పెద్దగా లేదు. కేవలం అప్పుల మీద నెట్టుకుని రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కో నెలలో జీతాలు కూడా లేట్ అవుతున్నాయి. అప్పు పుడితే కానీ, గడవని పరిస్థితికి వచ్చింది. ఇందు కోసం జగన్ మోహన్ రెడ్డితో పాటుగా, మంత్రి బుగ్గన చేయని ప్రయత్నం అంటూ లేదు. మంత్రి బుగ్గన ఢిల్లీ పర్యటనలో అప్పు కోసం అనేక ప్రయత్నాలు చేసారు. అయితే అదనపు వివరాలు కావాలని కేంద్రం కోరటం, ఆ అదనపు వివరాలు ఇచ్చిన తరువాత కేంద్రం అసలు విషయం చెప్పి భారీ షాక్ ఇచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రుణ పరిమితిని ఈ ఆర్ధిక ఏడాది, అంటే 2021-22 సమయానికి, రూ.42,472 కోట్లగా నిర్ణయించి, బహిరంగ మార్కెట్ లో రుణాలు తీసుకోవచ్చు అంటూ ముందుగా కేంద్రం చెప్పింది. అయితే ఇది సరిపోదని, ఇంకా అదనపు రుణం కావలి అంటూ బుగ్గన ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసారు. అయితే ఇప్పటి తీసుకున్న రుణాల పై సమగ్ర నివేదిక తమకు పంపిస్తే ఆలోచిస్తామని కేంద్ర ఆర్ధిక సఖ అధికారులు చెప్పారు.

center 02072021 2

ఆ వివరాలు అన్నీ పంపించిన తరువాత, రుణం పెంచుతారు అనుకుంటే, రూ.42,472 కోట్ల నుంచి రూ.27,668 కోట్లకు తగ్గించి షాక్ ఇచ్చారు. దీనికి కారణంగా గతంలో పరిమితికి మించి అప్పులు తీసుకున్నారని, ఇప్పుడు దాన్ని సరిచేస్తున్నాట్టు చెప్పారు. రాష్ట్ర జీడీపీలో 4 శాతం అప్పులు తీసుకోవచ్చు. అంటే రూ.42,472 కోట్లు. ఈ తీసుకున్న అప్పులో రూ.27,589 కోట్లను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద ఖర్చు పెడితే మరో 0.5% రుణాలు ఇస్తారు. అంటే మరో రూ.5,309 కోట్లు పెరుగాయి. లేకపోతే అంత తగ్గుతుంది. అంటే రూ.42,472 కోట్ల నుంచి రూ.37,163 కోట్ల వరుకే మన రుణ పరిమితి పరిమితం అవుతుంది. అయితే కేంద్రం అడిగిన లెక్కలు అన్నీ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రూపంలో పంపించింది. గతంలో మనకు ఉన్న రుణ పరిమితి కన్నా, రాష్ట్ర ప్రభుత్వం రూ.17,923.94 కోట్లు అదనంగా తీసుకున్నట్టు కేంద్రం గుర్తించింది. అవన్నీ లెక్కిస్తే, మీకు ఈ ఏడాది రుణ పరిమితి కేవలం రూ.27,668 కోట్లు అని కేంద్రం, ఏపి అధికారులకు తేల్చి చెప్పింది. ఈ దెబ్బతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు ఏమి చేయాలో పాలు పోవటం లేదు. అదనంగా రుణం ఇస్తారు అనుకుంటే, మరింత కోత పెట్టటం పై షాక్ అయ్యారు. ఎలాగైనా ఇంకా ఎక్కువ రుణం వచ్చేలా చూడాలని ప్రయత్నం చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read