జగన్ మోహన్ రెడ్డి పై తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఆయన మాటల్లోనే "ప్రభుత్వం ఎవరిని మోసగించడానికి కేబినెట్ సమావేశం నిర్వహించిందో తెలియడంలేదు. నిరుద్యోగులను దగా చేస్తున్న జగన్ ప్రభుత్వం మరోపక్కన రైతులను నిండాముంచడానికి చేతగాని దర్పాన్ని ప్రదర్శిస్తోంది. తాను ముఖ్యమంత్రి కావడానికి సహకరించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రుణం తీర్చుకోవడానికి జగన్ రెడ్డి ఈ రోజు వరకు చేయాల్సినవన్నీ చేస్తూనే ఉన్నాడు. చివరకు రాష్ట్ర ప్రయోజనాలను కూడా తాకట్టు పెట్టేసి, పొరుగు ముఖ్యమంత్రితో ఉత్తుత్తి యుద్ధాలకు తెరలేపుతున్నాడు. ప్రధానంగా కృష్ణా జలాలకు సంబంధించి, ఇరువురి మధ్య జరుగుతున్న నాటకీయ పరిణామాలు దేన్ని సూచిస్తున్నాయో అందరూ గమనించాలి. బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో 512 టీఎంసీలను ఆంధ్రాకు, 299టీఎంసీలు తెలంగాణకు కేటాయించారు. ఆ జలాలను వాడుకోవడంలో, మిగులుజలాల వినియోగంలో, రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నీటివాటా సాధనలో ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఎందుకంత భయం? అక్కడేమో కేసీఆర్ సవాల్ చేస్తుంటే, ఇక్కడేమో పిల్లిలా జగన్మోహన్ రెడ్డి బయటకు తొంగిచూస్తున్నాడు. ఎందుకింత బాధవచ్చిందో ఆయనే చెప్పాలి. ఈ ముఖ్యమంత్రి రాష్ట్రానికి రావాల్సిన నీటిని సాధించడంలో ఎందుకింతలా భయపడిపోతున్నాడు? ఎందుకింతలా మెతకవైఖరి అవలంభిస్తున్నాడు? కృష్ణాజ లాల వినియోగంలో, రాష్ట్ర హక్కులను కాపాడటంలో, రైతులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు. కృష్ణా వాటర్ బోర్డుని విజయవాడ నుంచి విశాఖపట్నం తరలించాలి అని భావించినప్పుడే ముఖ్యమం త్రి చిత్తశుద్ధి ప్రజలకు అర్థమైంది. కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రవహిస్తున్న కృష్ణా నది నీటి నిర్వహణకు సంబంధించిన బోర్డుని ఎప్పుడైతే విశాఖకు తరలించాలని, ఈ ముఖ్యమంత్రి భావించాడో, అప్పుడే కృష్ణాజలాలపై పెత్త నాన్ని తనకుతానే కేసీఆర్ కు అప్పగించాడు. జగన్మోహన్ రెడ్డి తాకట్టు రాజకీయాలకు కృష్ణా జలాల వివాదమే నిదర్శ నం. తెలంగాణలో, కేసీఆర్ కనుసన్నల్లో ఉన్న తన ఆస్తుల సంరక్షణ కోసమే ఈ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాలను, రైతాంగం ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి సిద్దమయ్యాడు. ధానికి, కేంద్రజలశక్తి మంత్రికి, లేఖలు రాస్తామంటున్నా రు. ఉన్న పుణ్యకాలం కాస్తా ముగియడానికే లేఖల రాయబారాన్ని తెరపైకి తెచ్చారు. ఈవ్యవహారం నుంచి ప్రజలదృష్టి, మరీముఖ్యంగా రైతులదృష్టి మళ్లించడానికే జగన్మోహన్ రెడ్డి పెదవా లంటీర్ గోదావరి నదీ పర్యటనకు వెళ్లాడు.
పోలవరం లో ఉన్న ప్రధాన సమస్య నిర్వాసితుల సమస్య. దాన్ని పరిష్కారంచేయకుండా, దానికి అవసరమైన కార్యాచరణ ప్రకటించకుండా, నిర్వాసితులకు ఒక భరోసా కల్పించకుండా సజ్జల పోలవరం వెళ్లి, పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు. సజ్జలకు నిజంగా సిగ్గుందా అనిపిస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ పనులు టీడీపీ ప్రభుత్వ హాయాంలోనే 72శాతం వరకు పూర్తయ్యాయి. రూ.12వేల కోట్ల నిధులు వెచ్చించి, ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చంద్రబాబునాయుడు పరుగులు పెట్టించారు. అలాంటి వ్యక్తి గురించి పెద వాలంటీర్ సజ్జల పిచ్చిప్రేలాపనలు చేస్తున్నాడు. ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి ఏంచెప్పాడో సజ్జలకు గుర్తులేదా? పోలవరం ప్రాజెక్ట్ పరిధిలోని నిర్వాసి తులందరికీ న్యాయం చేస్తానని, ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల పరిహారం ఇస్తానని చెప్పింది మర్చిపోయావా సజ్జలా ? వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హాయాంలో జరిగిన ఆర్ అండ్ ఆర్ , ల్యాండ్ అక్విజేషన్ కు అదనంగా రూ.5లక్షలిస్తానని చెప్పింది నిజంకాదా? అసలు ముంపునకే గురికాని 1300 ఎకరాల భూమిఉంటే, దానికి కూడా డబ్బులిస్తానని జగన్మోహన్ రెడ్డి ఆనాడు చెప్పలేదా? అవేవీ పట్టించుకోకుండా, నేడు ముసుగేసుకొని తాడేపల్లిలో కూర్చుంటే, బాధ్యతలేని సజ్జల, అబద్ధాలే తన ఆహారంగా బతికే సజ్జల నిర్వాసితుల ముందు ఏదేదో మాట్లాడుతున్నాడు. ముంపు ప్రాంతంలోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించకుండా కాఫర్ డ్యామ్ ఎలా మూసేస్తారో సజ్జల చెప్పాలి? ప్రభుత్వాని ప్రజలందరి పక్షాన బాధ్యతవహించడం తెలియదా? ఈవ్యవ హారంపై ప్రభుత్వం, ముఖ్యమంత్రి సంగతేమిటో తేలుస్తాం. అఖిలపక్షనేతలంతా కలిసి పోలవరంప్రాంతాన్ని సందర్శించి, నిర్వాసితులను కలిసి, వారికి రావాల్సిన న్యాయమైన పరిహారం వారికి అందేవరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాము.