రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సినిమా స్టూడియోలు కానీ, అసలు ఆ పరిశ్రమలే కానీ లేకుండా పోయాయి. అయితే విశాఖలో మాత్రం, ప్రముఖ నిర్మాత దివంగత రామానాయుడు పేరు మీద ఒక స్టూడియో ఉంది. విశాఖలో అన్ని ప్రముఖ ఆస్తులు లాగేసుకుంటున్నట్టే, ఈ ల్యాండ్ పై కూడా ప్రభుత్వ పెద్దల కన్ను పడింది. విశాఖలో బీచ్ రోడ్డుని ఆనుకుని ఈ స్టూడియో ఉంటుంది. ఈ స్టూడియోని 2008లో విశాఖలో ప్రారంభించారు. 2001లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి కేటాయించగా, 2008 నాటికి నిర్మాణం పూర్తయ్యింది. తరువాత వచ్చిన రాజశేఖర్ రెడ్డికి కూడా సహకరించారు. అప్పటి నుంచి ఇక్కడ చిన్న చిన్న సినిమాలతో పాటుగా,అ పెద్ద సినిమాల షూటింగ్ కూడా జరుగుతూ వచ్చింది. తెలుగు, హిందీ సినిమాలతో పాటుగా, ఒరియా సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ జరుగుతూ ఉండేది. అంతే కాకుండా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రముఖ స్టూడియో కావటంతో, ఇక్కడకు పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. బీచ్ రోడ్డున ఉండటం, బీచ్ కనిపిస్తూ, బీచ్ కూడా పక్కనే ఉండటం, వ్యూ బాగుండటంతో, ఈ స్టూడియోకి మంచి పేరు కూడా ఉంది. అయితే ఇప్పుడు రామానాయుడు స్టూడియోస్ పై, ప్రభుత్వంలో ఉన్న పెద్దల కన్ను పడింది.

studios 03072021 21

విశాఖలో క్యాంప్ ఆఫీస్ పెట్టటానికి జగన్ మోహన్ రెడ్డి ఎప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఇందు కోసం అనేక చోట్ల ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే కాపులుప్పాడ కొండ పై, గెస్ట్ హౌస్ పేరుతో, క్యాంప్ ఆఫీస్ నిర్మాణం జరుగుతుందని చెప్తున్నారు. అందుకు కూతవేటు దూరంలోనే ఈ స్టూడియో ఉంది. రేపు జగన్ అక్కడకు వస్తే, రామానాయడు స్టూడియో ఉన్న స్థలం ఎంతో ఉపయోగ పడుతుందని, కొంత మంది పెద్దలు ఆ స్టూడియో స్థలం ఇచ్చేయాలని, గత ఏడాది నుంచి ఒత్తిడి తెస్తున్నారు. ఇందు బదులుగా భీమిలిలో కొంత స్థలం ఇస్తామని చెప్తున్నట్టు తెలిసింది. అయితే ఇందుకు రామానాయుడు స్టూడియోస్ యాజమాన్యం ఒప్పుకోకపోవటంతో, వారి పై అనేక విధాలుగా ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తుంది. ఎలగైనా ఈ భూములు లాగేసుకుంటామని బెదిస్తున్నట్టు ఒక ప్రముఖ పత్రికలో కధనం వచ్చింది. అయతే రామానాయుడు గుర్తుగా దీన్ని నిర్వహిస్తున్నామని, ఇచ్చే ప్రసక్తే లేదని వారు చెప్తున్నారు. మరి ఈ వివాదం ఎలా ముగుస్తుంది, కోర్టు వరకు వెళ్తుందా అనేది చూడాల్సి ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read