ఆరేళ్ల క్రితం సుప్రీంకోర్టు రద్దు చేసిన ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ కింద ఇంకా దేశవ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదవుతుండటంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా దారుణమైన పరిణామమని అభివర్ణించింది. దీనిపై సమాధానమివ్వాలంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అదే సోషల్ మీడియా కేసు. సెక్షన్ 66ఏ, ఈ సెక్షన్ ని సుప్రీం కోర్టు, 2015 ఫిబ్రవరిలోనే రద్దు చేసింది. ఒక కేసు విచారణ సందర్భంగా, 2015లోనే సుప్రీం కోర్టు ఈ సెక్షన్ ని రద్దు చేసింది. ఇదే విషయం పై, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశిస్తూ, ఇదే విషయం తమ పరిధిలో ఉన్న పోలీసులకు చెప్పాలి అంటూ, సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలు ఉన్నా సరే, ఇప్పటికీ ఈ సెక్షన్ 66ఏతో కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. దీంతో ఈ విషయాన్ని ఒక సంస్థ అయిన పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్, సుప్రీం కోర్టు దృష్టికి తెచ్చింది. ఇదే విషయం పై సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. ఈ సెక్షన్ రద్దు చేసిన తరువాత, గత ఆరేళ్లలో, దాదాపుగా వెయ్యికి పైగానే కేసులు నమోదు అయ్యాయని, దీని పై సుప్రీం కోర్టు చర్యలు తీసుకోవాలి అంటూ, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే సంస్థ సుప్రీం కోర్టును ఆశ్రయించి, తగు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
ఈ పిటీషన్ ను ఈ రోజు సుప్రీం కోర్టు విచారణ చేసింది. జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్ ధర్మాసనం ఈ పిటీషన్ పై విచారణ చేసింది. ఈ పిటీషన్ విచారణకు తీసుకోవటమే, సుప్రీం కోర్టు బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము రద్దు చేసిన చట్టంతో, వెయ్యి కేసులు నమోదు అవ్వటం పై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది చాలా దారుణమైన పరిణామం అని, ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవటం దారుణం అంటూ వ్యాఖ్యానించింది. దీని పై సమాధానం చెప్పాలి అంటూ కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ కేసు పై తదుపరి విచారణను రెండు వారాలకు సుప్రీం కోర్టు వాయిదా వేసింది. సోషల్ మీడియాలో చట్ట వ్యతిరేకమైన పోస్టులు పెడుతున్నారు అంటూ, ఈ సెక్షన్ 66ఏ ని ఉపయోగించి, ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ లు చేసే వారు. అయితే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గ్రహించిన సుప్రీం కోర్టు, దీన్ని రద్దు చేసింది. అయినా ఇంకా కేసులు పెట్టటం పై సుప్రీం కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సెక్షన్ కాకపోయినా, సోషల్ మీడియా అరెస్ట్ లు జరిగిన విషయం తెలిసిందే.