విజయవాడ నగరానికి మణిహారంగా నిర్మిస్తున్న 'కనకదుర్గ ఫ్లై ఓవర్‌' పనులు దూసుకెళ్తున్నాయి... ముఖ్యమంత్రి నిర్దేశించిన టార్గెట్ ప్రకారం ఆగష్టు 15 నాటికి, ఫ్లై-ఓవర్ మొదలవ్వాలి అనే లక్షంతో పనులు సాగుతున్నాయి. 'సోమా కనస్ట్రక్షన్‌' కంపెనీ ఈ పనులను చేపట్టింది. విజయవాడ నగరంలో రూ.447.80 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఫ్లై ఓవర్‌ పనులకు 2015 డిసెంబరులో కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ శంకుస్థాపన చేశారు. 2.55 కిలోమీటర్లు.. 51 పిల్లర్లు పెట్రోలు బంకు నుంచి రాజీవ్‌గాంధీ పార్కు వరకు 2.55 కిలోమీటర్ల పొడవునా ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తున్నారు. ఫ్లై ఓవర్, రోడ్డు పోర్షన్, అప్రోచ్, సైడ్‌ డ్రెయిన్స్, సబ్‌వే అప్రోచ్‌ పనులు సాగుతున్నాయి. భవానీపురం క్యాస్టింగ్‌ డిపోలో స్లాబ్‌ పనులు జరుగుతున్నాయి.

ప్రస్తుతం పిల్లర్ల నిర్మాణం 90 శాతం పూర్తయింది. మరో వైపు సెగ్మెంట్ల నిర్మాణం చేపడుతున్నారు. పిల్లర్ల పై వీటిని అమర్చే పనులు మరో పది రోజుల్లోగా చేపట్టనున్నారు. ఒకసారి ప్రారంభమైతే. ఇక ఎక్కడ ఆగవు. చకచకా వీటిని పిల్లర్లపై నెల రోజుల్లో అమర్చేస్తారు. దుర్గగుడి వద్ద కృష్ణానదిలో నిర్మిస్తున్న మినీ బ్రిడ్డి నిర్మాణం సైతం పూర్తయింది.

పనుల పురుగోతి..

  • ఫ్లై-ఓవర్ కోసం 47 స్తంభాలు వేయాల్సి ఉంది. ఇప్పటికి 32 సిద్ధమయ్యాయి.
  • స్తంభాల కోసం భూమిలో 417 పునాదులను (పైల్స్) వేయాల్సి ఉంది. వీటిలో ఇప్పటికే 408 పూర్తయ్యాయి.
  • దుర్లగుడి వద్ద వేస్తున్న 260 మీటర్ల చిన్న వంతెన నిర్మాణం 95 శాతం పూర్తయింది.
  • కృష్ణలంక వద్ద ఏర్పాటు చేస్తున్న అండర్ పాస్ పై నుంచి, కింద నుంచి మరో పది రోజుల్లో రాకపోకలు ప్రారంభించనున్నారు.
  • పైవంతెనపై ఆరు లేన్ల రహదారి వస్తున్నందున 24 మీటర్ల వెడల్పు ఉండబోతోంది.
  • కింద నాలుగు లేన్ల రహదారి నిర్మాణం చివరి దశకు చేరుకుంటోంది.
  • ఒక్కో పిల్లర్ కు మధ్యలో 35 మీటర్ల దూరం ఉంటుందిక్కడ ఈ పిల్లర్ల మధ్యలో 30 సెగ్మెంట్ల ముక్కలను అమరుస్తారు. దీనికి తగ్గట్టుగా పిల్లర్లను అత్యంత పటిష్టంగా నిర్మించారు.

ఈ క్రింది వీడియో చూడండి, ఎంత అద్భుతంగా, నిర్మిస్తున్నారో...

Advertisements

Advertisements

Latest Articles

Most Read