జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సోమవారం జరగాల్సిన జగన్ మోహన్ రెడ్డి పర్యటన, అమిత్ షా అప్పాయింట్మెంట్ లేకపోవటంతో రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు అంటే, గురువారానికి అమిత్ షా అప్పాయింట్మెంట్ లభించింది. సోమవారం అప్పాయింట్మెంట్లు రద్దు అవ్వటంతో, ఎలాగైనా గురువారానికి అప్పాయింట్మెంట్ లు ఫిక్స్ చేయాలని ఎంపీలకు చెప్పటంతో, ఎంపీలు మంగళవారం ఢిల్లీ వెళ్లి, గురువారం నాటికి ఎలాగైనా అప్పాయింట్మెంట్ రావాలని ఆదేశాలు రావటంతో, విజయసాయి రెడ్డి ఢిల్లీలో మకాం వేసి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అప్పాయింట్మెంట్ తో పాటుగా, జలసక్తి శాఖా మంత్రి, పెట్రోలియం శాఖా మంత్రి, కేంద్ర పర్యావరణ శాఖా మంత్రి అప్పాయింట్మెంట్ లు కూడా తీసుకున్నాట్టు చెప్పారు. అయితే ఆర్ధిక మంత్రి, రక్షణ శాఖా మంత్రి అప్పాయింట్మెంట్ లు మాత్రం ఇంకా ఖరారు కాలేదని తెలుస్తుంది. ఈ నేపధ్యంలోనే జగన్ ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు పై జగన్ వివరణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా రఘురామకృష్ణం రాజు వ్యవహారంలో, జగన్ ప్రభుత్వ వైఖరి దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
రాజద్రోహం కేసు పై ఏకంగా సుప్రీం కోర్టు కూడా, దీన్ని తేల్చేస్తాం అంటూ వ్యాఖ్యలు చేయటం, దేశ వ్యాప్త చర్చకు దారి తీసింది. ఏకంగా ఆ చట్టమే రద్దు కావాలి అంటూ, దేశ వ్యాప్తంగా గొంతులు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రఘురామకృష్ణం రాజు, అందరు ఎంపీలకు, సియంలకు, గవర్నర్లకు కూడా మొత్తం వివరాలతో లేఖలు రాసారు. ఈ మొత్తం వ్యవహారంలో ఏపి ప్రభుత్వ ఇమేజ్ డ్యా-మే-జ్ కావటంతో తమ వైఖరి కూడా వివరించాలని భావిస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే రఘురామరాజు కుటుంబ సభ్యులు అమిత్ షా ని కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే, తమ వాదన కూడా వివరించనున్నారు. దీంతో పాటుగా, నాంపల్లి కోర్టులో, జగన్ బెయిల్ రద్దు పిటీషన్ కూడా విచారణకు వస్తున్న సమయంలో, దాని పై విచారణ కూడా ప్రారంభం అవుతున్న నేపధ్యంలో కూడా, ఇది కూడా చర్చిస్తున్నారు. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం, పోలవరం, వ్యాక్సిన్లు, ప్రత్యేక హోదా కోసం వెళ్తున్నారని చెప్తున్నారు. అమిత్ షా అప్పాయింట్మెంట్ రాత్రి తొమ్మిది గంటలకు ఉండటం గమనార్హం. ఎప్పుడు జగన్ ఢిల్లీ వచ్చినా, అమిత్ షా రాత్రి తొమ్మిది గంటలకే అప్పాయింట్మెంట్ ఇస్తూ ఉండటం గమనించాల్సిన అంశం.