రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన నీటి జగడం వ్యవహరం సుప్రీం కోర్టుకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్ట్ లో విద్యుత్ ఉత్పత్తి కోసం నీళ్ళను తెలంగాణా వాడేస్తూ, ఆ నీటిని అనవసరంగా కిందకు పంపుతున్నారని, అవి సముద్రపు పాలు అవుతున్నాయి అంటూ, ఏపి ప్రభుత్వం అభ్యంతరం చెప్తూ, సుప్రీం కోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్ ఈ రోజు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ముందుకు వచ్చింది. తెలంగాణా ప్రభుత్వాన్ని వెంటనే విద్యుత్ ఉత్పత్తిని ఆపేయాలని ఆదేశాలు ఇవ్వాలి అంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ పిటీషన్ లో కోరింది. అయితే ఈ అంశం పై విచారణ మొదలు కాగానే, చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అభ్యంతరం చెప్పారు. తాను న్యాయ పరమైన అంశాల జోలికి వెళ్ళదలుచుకోలేదని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేసారు. తాను రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తిని అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు, మధ్యవర్తిత్వం ద్వారా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని కోరుతున్నానని అన్నారు. మధ్యవర్తిత్వం ద్వారా ఈ వివాదానికి పరిష్కారం అందించే అవకాశాలు ఉన్నాయి అంటూ, జస్టిస్ ఎన్వీ రమణ ఈ రెండు రాష్ట్రాలకు ఎన్వీ రమణ సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల న్యాయవాదులు ఈ దిశగా ఆలోచించాలని సూచించారు.

nvramana 02082021 2

అయితే దీని పై విచారణ కొనసాగించాలని రెండు రాష్ట్రాలు భావిస్తే కనుక, తాను ఈ పిటీషన్ ను వాదించలేనని, ఈ పిటీషన్ ను వేరే ధర్మాసనానికి బదిలీ చేస్తామని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. మరో పక్క మధ్యవర్తిత్వం ఇరు రాష్ట్రాలకు ఆమోదం అనుకుంటేనే, తాను ఈ విషయాన్ని చేపడతామని అన్నారు. అయితే ఎన్వీ రమణ ఈ విషయం చెప్పిన వెంటనే, చీఫ్ జస్టిస్ చెప్పిన అంశాన్ని, ఏపి ప్రభుత్వ తరుపు న్యాయవాది దవే స్పందిస్తూ, ఇది చాలా మంచి విషయం అని, దీన్ని ఏపి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని చెప్పారు. వారి అభిప్రాయం చెప్తామని కోర్టుకు చెప్పారు. అయితే ఈ సందర్భంగా తెలంగాణా ప్రభుత్వం తరుపు న్యాయవాది, అసలు ఇప్పుడు సమస్యే లేదని, కేంద్ర ప్రభుత్వం బోర్దులకు పెత్తనం ఇస్తూ గజెట్ ఇచ్చిందని, అంతే కాకుండా నీళ్ళు కూడా ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. అయితే ఏపి ప్రభుత్వం లాయర్ మాత్రం,బోర్డుకు ఇంకా నాలుగు నెలల సమయం ఉందని, ఇప్పటికే ఈశాన్య రాష్ట్రంలో గొడవలు చూస్తున్నాం అన్నారు. అయితే జస్టిస్ ఎన్వీ రమణ జోక్యం చేసుకుని, అసలు కలలో కూడా అలాంటి ఆలోచన రానివ్వద్దు అంటూ, ఈ విషయం పై ఒక పెద్ద మనిషి తరహాలో చెప్తూ, మధ్యవర్తిత్వం గురించి ఆలోచించాలని, కేసు ఎల్లుండికి వాయిదా వేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read