మాజీ మంత్రి, సీనియర్ నేత అయిన వివేక కేసుకి సంబంధించి, సిబిఐ మొదటి అరెస్ట్ చూపించింది. వివేక కేసులో కీలకమైన వ్యక్తి అంటూ సిబిఐ చెప్తున్న సునీల్ యాదవ్ ని, నిన్న సిబిఐ గోవాలో అరెస్ట్ చేసింది. సునీల్ యాదవ్ ప్రధాన నిందితుడు అంటూ సిబిఐ అనుమానిస్తున్న తరుణంలో ఆయన గత కొంత కాలంగా తప్పించుకుని తిరుగుతున్నాడు. అంతే కాకుండా, సిబిఐ తన వెంట పడుతుంది, తన పై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుంది అంటూ, తనను కాపాడాలి అంటూ, ఆయన ఏపి హైకోర్టులో కూడా పిటీషన్ దాఖలు చేసారు. అయితే ఈ పిటీషన్ వేసిన సందర్భంలోనే, సునీల్ యాదవ్ తన ఇంటికి తాళం వేసి, పారిపోవటం జరిగింది. ఈ నేపధ్యంలోనే సిబిఐ అధికారులు సునీల్ యాదవ్ కోసం, ప్రత్యెక బృందాలను పంపి మరీ గాలింపులు చేసారు. ప్రత్యేక నిఘా పెట్టటంతో, సునీల్ యాదవ్ గోవాలో తలదాచుకున్నట్టు సిబిఐకి సమాచారం రావటంతో, సిబిఐ అధికారులు గోవాకు వెళ్లి వారిని అక్కడ అరెస్ట్ చేసారు. అయితే అరెస్ట్ చేసిన తరువాత, కోర్టులో అరెస్ట్ చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపధ్యంలోనే సునీల్ యాదవ్ ని గోవా కోర్టులో హాజరు పరిచారు. ఈ రోజు సిబిఐ అధికారులు ఈ విషయాన్నీ ధృవీకరించారు. ఈ రోజు ఆయన్ను కోర్టులో హాజరు పరిచిన తరువాత, రిమాండ్ తీసుకుని, కడపకు తరలిస్తున్నారు.
రేపు ఉదయం ఆయన్ను కడపలో, ఆయన్ను కోర్టులో హాజరుపరిచి, మళ్ళీ రిమాండ్ కు పంపించి, సిబిఐ కస్టడీకి ఇవ్వమని కోర్టును అడిగే అవకాసం ఉంది. వివేక కేసులో సిబిఐ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇప్పటికే అక్కడ ఉన్న వాచ్మెన్ రంగయ్య నుంచి వాంగ్మూలం తీసుకుని, ఆయన స్టేట్మెంట్ ను జడ్జి ముందు కూడా వినిపించారు. రంగయ్య ఇచ్చిన వాంగ్మూలం తరువాతే, ఈ ప్రక్రియ వేగవంతం అయ్యింది. ఈ దొంక అంతా కదిలింది. ఇంతకు సుపారీ మాట్లాడుకున్నారు, ఎంత మంది ఉన్నారు, ఇలా పూర్తి వివరాలు చెప్పాడు. అయితే ఇద్దరు ప్రముఖులు ఉన్నారని రంగయ్య చెప్పటం, ఆ ప్రముఖులు ఎవరు అనే విషయం మాత్రం ఇప్పటి వరకు తెలియలేదు. ఈ విచారణ ఇలా ఉంటే, అసలు విచారణ పై మాత్రం, అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారు కూడా ఉన్నారు. వివేక కుమార్తె సునీత ఇచ్చిన అనుమాతిల్లోని ప్రముఖులను ఇప్పటి వరకు సిబిఐ విచారణ చేయక పోవటం పై, అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రముఖులను కూడా విచారణ చేయాలని, అప్పుడే అసలైన నిజాలు బయటకు వస్తాయని అంటున్నారు.