అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి , తన పై వ్యక్తిగతంగా కక్ష కట్టి, నిరాధారమైన ఆరోపణలు చేసి, తనని సస్పెండ్ చేసిన వారి పై, తన పై కుట్రలు పన్నిన వారి పై, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సీరియస్ అయ్యారు. ఎక్కడ నుంచి తన పై కక్ష కట్టారో, అక్కడ నుంచే ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టారు. 2019 ఎన్నికల ముందు తన పై విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలు దగ్గర నుంచి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పని మొదలు పెట్టారు. జూన్ 19న ఎంపీ విజయసాయి రెడ్డికి, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు లీగల్ నోటీసులు పంపించారు. 2019 ఎన్నికల ముందు, తన పై తప్పుడు ఫిర్యాదులు చేసారు అంటూ ఏబీ వెంకటేశ్వరరావు లీగల్ నోటీసులు పంపించారు. ఎన్నికల ముందు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సమయంలో, తన పై అప్పటి ఎన్నికల కమిషన్ కు తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు అనేది ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపణ. ఎన్నికల ముందు శ్రీకాకుళం జిల్లా నేత ఒకరు, 50 కోట్ల రూపాయలు కారులో తరలిస్తూ ఉండగా, పోలీసులు పట్టుకుంటే, ఏబివి ఫోన్ చేసి, వారిని వదిలేయమని చెప్పారు అంటూ, విజయసాయి రెడ్డి మీడియాతో చెప్పారని, అది తప్పుడు ఆరోపణలు అని, విజయసాయి రెడ్డి చెప్పిన దానిలో ఎలాంటి వాస్తవం లేదని, అప్పట్లోనే శ్రీకాకుళం ఎస్పీగా పని చేసిన ఆఫీసర్ దాన్ని ఖండించినట్టు చెప్పారు.

abv p 02082021 2

అయితే ఇదే విషయాన్ని కావాలని పదే పదే సాక్షిలో వేస్తూ, తన పరువుకు భంగం కలిగించారు అంటూ, విజయసాయితో పాటుగా, అప్పటి జగతి పబ్లికేషన్స్ ఎండి సజ్జల రామకృష్ణారెడ్డి, సాక్షి దినపత్రిక, సాక్షి ఛానెల్., అప్పటి సాక్షి పత్రిక సంపాదకులు శ్రీ రామచంద్రమూర్తి, సాక్షి ఛానెల్ ఎడిటర్ శ్రీ వి మురళిలను కూడా ఈ పరువు నష్టం దావాలో ప్రతివదులుగా చేర్చారు. తన పరువుకి నష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేసి, వాటిని వార్తలుగా ప్రచురించినందుకు, ఆరుగురికి పరువునష్టం నోటీసులు పంపారు ఏబీ వెంకటేశ్వరరావు. భేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదా లీగల్ గా ముందుకు వెళ్తానని చెప్పారు. అయితే ఈ కేసుతో మొదలు పెట్టి, అనేక కేసులు పై ఉక్కిరిబిక్కిరి చేయటానికి రెడీ అయ్యారు. ఇందులో విశేషం ఏమిటి అంటే, ఈ నోటీస్ పంపి పది రోజులు కూడా అవ్వక ముందే, ఆయన్ను ఏకంగా డిస్మిస్ చేయాలని కేంద్రానికి లేఖ రాసింది జగన్ ప్రభుత్వం. ఇది ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read