రెండు రోజులు క్రితం, అశోక్ గజపతి రాజు గారు హైకోర్టుకు వెళ్లి, మాన్సాస్ ఈవో చేస్తున్న పనుల పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. చివరకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వటానికి కూడా మాన్సాస్ ఈవో ఇబ్బంది పెడుతున్న తీరుతో, హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మాన్సాస్ చైర్మెన్ అశోక్ గజపతి రాజు మాటే ఫైనల్ అని, ఆయన ఆదేశాలు పాటించాల్సిందే అంటూ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు ఆదేశాలతో మాన్సాస్ ఈవో దిగి వచ్చారు. వెంటనే పెండింగ్‌లో ఉన్న జీతాలు చెల్లిస్తూ ఛైర్మన్ ఆదేశాలను పాటించాలని హైకోర్టు ఆదేశం ఇవ్వటంతో,  హైకోర్టు తీర్పు మేరకు కొంతమంది ఉద్యోగుల బ్యాంకు ఖాతాలను ఈవో ఈ రోజు పునరుద్ధరించారు. మిగిలిన ఉద్యోగుల బ్యాంకు ఖాతాలను రేపు పునరుద్ధరిస్తానని ఉద్యోగులకు ఈవో హామీ ఇచ్చారు. దీంతో మాన్సాస్ ఉద్యోగులు ఛైర్మన్ అశోక్ గజపతిరాజుకి ధన్యవాదాలు తెలిపారు. ఇంత చిన్న చిన్న పనులకు కూడా కోర్టుల ద్వారా సాధించుకోవాల్సి రావటం బాధాకరం అని వాపోతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read