దేశ రాజకీయాలతో పాటుగా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా మారిపోతాయేమో అని అనుకునే వార్త ఇది. అబద్ధాలు, అసత్యాలు, ఫేక్ ప్రచారాలు, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య కుంపట్లు పెట్టి, ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి వివిధ రాష్ట్రాల్లో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. 2014లో నరేంద్ర మోడీని ప్రధాని చేయటంలో, అలాగే జగన్ మోహన్ రెడ్డిని గద్దెను ఎక్కించటంలో ఇవే ఫేక్ ప్రచారాలు వాడారు ప్రశాంత్ కిషోర్. దీంతో ఆయనకు డిమాండ్ పెరగటంతో, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో కూడా అక్కడ స్టాలిన్, మమతతో కలిసి, వారిని మళ్ళీ అధికారంలోకి తేవటంలో కీలక పాత్ర పోషించారు. ఇది ఇలా ఉంటే, గతంలో ఏ మోడీని అయితే అధికారంలోకి తెచ్చారో, ఇప్పుడు అదే మోడీని దించటానికి ప్రశాంత్ కిషోర్ పూనుకున్నారు. ఇది ఆయన కాంట్రాక్టు లో భాగమో లేక, వ్యక్తిగతంగా తీసుకున్నాడో కానీ, ప్రశాంత్ కిషోర్ మోడిని దించటానికి వ్యతిరేక ఫ్రంట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తుంది. మమతా బెనర్జీ, సరద్ పవార్, స్టాలిన్, అలాగే ఇతర ముఖ్య నేతలను ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే ఒప్పించారు. ఈ నేపధ్యంలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి, ప్రశాంత్ కిషోర్ కన్ను జగన్ పై పడింది. వైఎస్ఆర్ ని కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు ముఖ్యమంత్రిని చేసిన సంగతి తెలిసిందే.

pk 01082021 2

జగన్ కూడా మొదట ఎంపీ అయ్యింది కాంగ్రెస్ పార్టీ నుంచే. ఈ నేపధ్యంలోనే జగన్ ని కూడా , ఈ కూటమిలోకి తీసుకుని రావటానికి ప్రశాంత్ కిషోర్ స్కెచ్ వేసారని సమాచారం. గత వారం,ఈ విషయం పై, ఢిల్లీలో, విజయసాయి రెడ్డితో, చర్చలు కూడా జరిపారని తెలుస్తుంది. అయితే ఈ ప్రతిపాదనను విజయసాయి రెడ్డి తోసి పుచ్చి, తమకు కాంగ్రెస్ అన్యాయం చేసి, కేసులు పెట్టించిందని, ఎలా కలుస్తామని అడగగా, దానికి కూడా ప్రశాంత్ కిషోర్ సమాధానం చెప్పారని, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధాని అభ్యర్ధి ఉండరని, కేవలం కాంగ్రెస్ నేతృత్వం వహిస్తుందని చెప్పినట్టు తెలుస్తుంది. ఇప్పుడే మద్దతు ఇస్తే, తరువాత మీకే మంచి జరుగుతుందని చెప్పినట్టు సమాచారం. మోడి టీం, అదును చూసి మీకు దెబ్బ వేస్తారని, అంతకంటే ముందే ఒక స్టాండ్ తీసుకుంటే, మీకే మంచిది అంటూ ప్రశాంత్ కిషోర్ చెప్పారని సమాచారం. ఇదే విషయం పై జగన్ తో కూడా త్వరలో చర్చిస్తారట. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో, జగన్ ఆ ఆలోచన చేసినా, పైనున్న మోడీ, షా ఏమి చేస్తారో అందరికీ తెలిసిందే. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read