ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది రాజకీయ నాయకుల ప్రాధాన అస్త్రం. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాను ఉపయోగించటంలో ముందు ఉంది. ముఖ్యంగా అప్పటి రాష్ట్ర విభజన తరువాత, చంద్రబాబు అవసరం ఎందుకు ఉంది అనే విషయం ప్రజల్లోకి సోషల్ మీడియా ద్వారా బాగా తెసుకుని వెళ్ళారు. అంటే ఇది పాజిటివ్ క్యంపైన్ అనమాట. 2019 ఎన్నికలకు వచ్చేసరికి, ప్రశాంత్ కిషోర్ ఎంట్రీతో, సోషల్ మీడియా అనేది ఫేక్ న్యూస్ వ్యప్తికి వైసీపీ ఎక్కువ వాడింది. ప్రజలు చంద్రబాబు చేసిన అభివృద్ధి కంటే, ఫేక్ న్యూస్ నే ఎక్కువ నమ్మి, తెలుగుదేశం పార్టీని ఓడించారు. ఇలా సోషల్ మీడియా అనేది, తమ ప్రత్యర్ధుల పై బురద చల్లటానికే ఎక్కువ వాడుతున్నారు. మహిళా నేతలు అని కూడా చూడటం లేదు. పలాస నియోజకవర్గంలో అక్కడ అధికార పార్టీలో ఉంటూ మంత్రిగా ఉంటున్న సిదిరి అప్పల రాజు, ఆలాగే ప్రతిపక్షంలో ఉన్న గౌతు శిరీష వర్గాల మధ్య సోషల్ మీడియా వార్, చివరకు వల్గర్ గా మారింది. మంత్రి అనుచురులు, మహిళా నేత అయిన గౌతు శిరీషను అసభ్యంగా టార్గెట్ చేసే దాకా వెళ్ళింది. ఈ వికృత క్రీడతో, పలాస నియోజకవర్గంలో మంత్రి అప్పల రాజుకు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనే చెప్పవచ్చు. తన అనుచురులను కంట్రోల్ చేయటంలో మంత్రి ఫెయిల్ అయ్యారు అనే అభిప్రాయం ఉంది.
2019 ఎన్నికల్లో గౌతు శిరీష, అప్పల రాజు, ఎన్నికల్లో పోటీ పడ్డారు. అప్పుడు కూడా సోషల్ మీడియాను ఉపయోగించుకుని ఇరు వర్గాలు హోరాహరీగా పోరాడాయి. అయితే ఎన్నికల తరువాత, అందరి నాయకులు లాగే, గౌతు శిరీష కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. ఇక రోజు రోజుకీ వైసిపీ ఆగడాలు శ్రుతిమించుతూ ఉండటం గమనించి, ఆవిడ ఆక్టివ్ అయ్యారు. సమస్యలు లేవనెత్తుతూ, తన ప్రత్యర్ధిగా ఉన్న అప్పలరాజు ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇది సోషల్ మీడియాలో మాత్రం వికృత రూపం దాల్చింది. హుందాగా కాకుండా, మహిళా నేత పై, అసభ్య పదజాలం ఉపయోగించే దాకా వెళ్ళింది. దీంతో గౌతు శిరీష సీరియస్ అయ్యి పోలీస్ కేసు పెట్టారు. ఎదురు అప్పల రాజు వర్గీయులు కూడా కేసులు పెట్టారు. ఈ విషయం పై గౌతు శిరీష సీరియస్ అవ్వటం, ప్రజల ముందు తన వాదన బలంగా పెట్టటంతో, మంత్రి అప్పల రాజుకు ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావటంలో సక్సస్ అయ్యారు. అయితే త్వరలో జరిగే మంత్రివర్గ మార్పులు చేర్పుల్లో, ఈ అంశం అప్పల రాజు మంత్రి పదివి చేటు చేసే అవకాసం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి మరి, ఈ విషయం ఎక్కడ వరకు వెళ్తుందో.